- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం: మగబిడ్డను కనలేదని.. భార్యపై మరుగుతున్న నీటిని అక్కడ పోసి
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మారుతోంది. ఆడపిల్లలపై వివక్ష పోతోంది. ఒకప్పుడు మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే వ్యవస్థ నుంచి .. మహిళ లేనిదే ప్రపంచం లేదు అనే ధోరణి సమాజంలో రావడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అయితే ఇదంతా ఒక వైపే.. మరో వైపు మహిళపై దారుణాలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు.. ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చంపే కీచకులు ఇంకా ఉన్నారు. ఆడ, మగ తేడా మాకు లేదు అంటున్న వారు కొందరు అయితే.. మగబిడ్డ అయితేనే కను.. లేకపోతే అబార్షన్ చేయించుకో అనే కిరాతక తండ్రులు లేకపోలేదు. తాజాగా మగబిడ్డను కనలేదని భార్యపై మరుగుతున్న నీటిని పోసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ రాక్షస భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు సంజు అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదటి నుంచి సత్యపాల్ కి మగబిడ్డ కావాలని భార్యను వేధిస్తూనే ఉండేవాడు. అయితే సంజుకు మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లల్లే పుట్టారు. దీంతో భార్యపై భర్త సత్యపాల్ ద్వేషం పెంచుకున్నాడు. ఆడపిల్లలను కన్నదని అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. గత కొంత కాలంగా పుట్టింటి నుంచి అదనపు కట్నంగా రూ. 50 వేలు తీసుకురావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.
మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్యపై ద్వేషం పెంచుకున‍్న సత్యపాల్ కొద్ది రోజులుగా సంజూకు భోజనం కూడా పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13 న భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై కోపంతో రగిలిపోయిన సత్యపాల్ పక్కనే స్టవ్‌పై మరుగుతున్న వేడినీటిని ఆమెపై పోసి పరారయ్యాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు సంజూను హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి: