- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేస్‌బుక్‌లో భార్యకు భర్త వేధింపులు
దిశ, క్రైమ్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన కావలి తారక మహేష్ కు ఫేస్ బుక్ ద్వారా ట్రాన్స్ జెండర్ పరిచయమైంది. తాను ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలిసి కూడా.. వారిద్దరూ చాటింగ్ ద్వారా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎల్‌బీ నగర్ లో ఉంటున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వరకట్నం వేధింపులు చేశాడు. దీంతో ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లాడు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన తారక మహేష్ తన భార్య మరో ఫేస్ బుక్ వినియోగిస్తున్నట్టు గుర్తించాడు. దీంతో తన స్నేహితుడు మొబైల్ ఫోన్ ద్వారా ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసుకున్న మహేష్.. భార్యను వేధించసాగాడు. వివిధ రకాల అసభ్యకర సందేశాలతో పాటు అశ్లీల ఫోటోలు, వీడియోలు సెండ్ చేశాడు. ఫేస్ బుక్ లో వేధింపులపై బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భర్తే వేధించినట్టుగా పోలీసులు నిర్థారించారు. దీంతో నిందితుడు మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, ఏసీపీ హరినాథ్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం.శంకర్ లను సీపీ అభినందించారు.