- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి పురుషాంగంపై కాల్పులు.. ట్విస్ట్ ఏంటంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె ప్రియుడిపై కాల్పులు జరిపాడో భర్త. అతడి పురుషాంగంపై తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెంగ్గనూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (37) కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వారి కాపురంలో కలతలు చెలరేగడంతో ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే భార్య వేరే ఇంటికి వెళ్ళిపోయింది.
విడాకుల కేసు విచారణ కొనసాగే సమయంలోనే భార్యకు వేరొక వ్యక్తితో సంబంధం ఉందని భర్త తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న భర్త కోపంతో రగిలిపోతూ భార్య ఇంటికి చేరుకున్నాడు. అక్కడ భార్యతో పాటు ఉన్న ప్రియుడిపై దాడికి పాల్పడ్డాడు. తనతో పాటు తెచ్చిన తుపాకీతో ప్రియుడి పురుషాంగంపై కాల్పులు జరిపాడు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా ప్రియుడు.. ప్రియురాలి భర్తపై ఫిర్యాదు ఇవ్వకపోవడం విశేషం. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.