భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

by Sumithra |

దిశ, మెదక్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నె మల్లేష్(31) కొన్నాళ్లుగా మద్యం, పేకాటకు బానిసయ్యాడు. దీని మూలంగా ఉన్న పొలం అమ్మగా వచ్చిన ఆ రూ.5లక్షల డబ్బు కూడా ఖర్చు చేశాడు. ఈ క్రమంలోనే భార్య ప్రవళికతో తరచూ గొడవపడుతుండే వాడు. ఈ నెల 21న కూడా ఆమెతో గొడవ పడటంతో ఆమె ముగ్గురు పిల్లలను తీసుకుని
పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లేష్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: wife and Husband, suicide, medak, sangareddy, drinks

Advertisement

Next Story

Most Viewed