- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు.. బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మొన్ననూరు గ్రామానికి చెందిన మంతటి సాయి శేఖర్ అతని భార్య లలిత మీనా.. వారి బంధువు వివాహానికి శనివారం వెళ్లారు.
అనంతరం ఆదివారం భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్‌కు TS 31 D 1397 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో AP 12 D 2320 నెంబర్ ఉన్న ఇండికా కార్.. అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ పరిధిలోని వై జంక్షన్ సమీపంలో వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దంపతుల మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే.. 8 నెలల క్రితం వారిద్దరికీ వివాహం జరగింది.. ఈ క్రమంలో వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ రాజు తెలిపారు.