మానవాళి ఈ మహమ్మారిని తప్పక జయిస్తుంది : ప్రధాని

by vinod kumar |
మానవాళి ఈ మహమ్మారిని తప్పక జయిస్తుంది : ప్రధాని
X

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని మానవాళి తప్పక జయిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ లాక్‌డౌన్ కాలంలో ప్రజలకు సహాయపడుతూ.. కొవిడ్ 19పై పోరు సాగిస్తున్న మంత్రిత్వ శాఖలపై ప్రశంసలు కురిపించారు. భారతీయులకు సంఘీభావాన్ని తెలుపుతూ వెయ్యి మీటర్ల సైజులో త్రివర్ణ పథకాన్ని ప్రదర్శించిన స్విట్జర్లాండ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇండియన్ ఎంబస్సీ ట్వీట్‌కు ప్రధాని స్పందించారు. కొవిడ్ 19పై ప్రపంచం ఐక్యంగా పోరాడుతున్నదని, మానవాళి తప్పక ఈ మహమ్మారిని గెలిచి తీరుతుందని పేర్కొన్నారు.

దీనితోపాటు లాక్‌డౌన్ కాలంలో అందిస్తున్న సేవలను పేర్కొన్న ఇతర మంత్రుల ట్వీట్‌లపైనా మోడీ స్పందించారు. లాక్‌డౌన్‌లో ప్యాసింజర్ ట్రైన్‌లు మాత్రమే నిలిచిపోయాయని, రైల్వే సేవలందిస్తూనే ఉన్నదని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందిస్తూ.. రైల్వే టీమ్ పట్ల గర్విస్తున్నారని, ఈ ఆపత్కాలంలో పౌరులకు ఎంతో ఉపయోగపడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చేలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్న గ్యాస్ సిలిండర్ డెలివరీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి.. భారత అవసరాల కోసం 24గంటలు పనిచేస్తున్న వారందరికీ కుదోస్ అంటూ ప్రధాని రెస్పాండ్ అయ్యారు. గతపదిరోజుల కాలంలో కొవిడ్ 19 సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్ఎంఈలకు, ఆదాయ పన్ను రిఫండ్‌లకు సీబీడీటీ సుమారు రూ. 5,204కోట్లను ఇష్యూ చేసిందని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఐటీ శాఖ.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలబడేందుకు కమిటెడ్‌గా ఉన్నదని మోడీ ప్రశంసించారు. మార్చి 26 నుంచి ఉడాన్ కింద ఎన్నో అత్యవసర, మెడికల్ ఉత్పత్తులను కనీసం 262 విమానాలు చేరవేస్తున్నాయని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పూరి ట్వీట్ చేయగా.. అవసరాల్లో ఉన్నవారందరికీ సహాయపడాలని మోడీ రియాక్ట్ అయ్యారు.

Tags: pm modi, tweet, pandemic, humanity, switzerland, ministries

Advertisement

Next Story

Most Viewed