హిందుస్థాన్ యూనిలీవర్ త్రైమాసిక లాభం రూ. రూ. 1,519 కోట్లు!

by Harish |
హిందుస్థాన్ యూనిలీవర్ త్రైమాసిక లాభం రూ. రూ. 1,519 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) నాలుగవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సర ఆదాయం రూ. 39,136 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 38,579 కోట్లతో పోలిస్తే 1.4 శాతం పెరిగిందని సంస్థ వెల్లడించింది. నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,054 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ. 6,748 కోట్లని సంస్థ వెల్లడించింది.

మార్చి తో ముగిసిన త్రైమాసికం లాభం 1.2 శాతం క్షీణించి రూ. 1,519 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 9.4 శాతం తగ్గి రూ .9,011 కోట్లకు చేరుకుంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పడిపోయింది. మార్చి త్రైమాసికంలో, దేశీయ వినియోగదారుల వృద్ధి 9 శాతం పడిపోయి, వాల్యూమ్ వృద్ధిలో 7 శాతం క్షీణించిందని కంపెనీ తెలిపింది.

“మార్చి రెండవ వారం నుంచి కొవిడ్-19 ప్రభావం పెరిగింది. లాక్‌డౌన్ తర్వాత కార్యకలాపాలు పూర్తిగా క్షీణించాయి. దేశీయ వినియోగదారుల వృద్ధి 9 శాతం క్షీణించి, వాల్యూమ్ వృద్ధిలో 7 శాతం క్షీణత నమోదు అయ్యిందని’ హెచ్‌యూఎల్ సంస్థ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ దేశీయ వినియోగదారుల వృద్ధి 2 శాతం, వాల్యూమ్ పెరుగుదల 2 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. “కొవిడ్-19 అతిపెద్ద సవాలు. జీవితాలను కొనసాగిస్తూనే, జీవనోపాధిని కాపాడుకోవాలి. తమ సంస్థ నమ్మిన బ్రాండ్ల పోర్ట్‌ఫోలియో, ఆర్థిక స్థిరత్వం, నాయకత్వంలో నాణ్యత వల్ల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, మారుతున్న భవిష్యత్తు అంచనాలతో ముందుకెళ్తాము ” అని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా అన్నారు.

హోమ్‌కేర్ వ్యాపార ఆదాయం సంవత్సరానికి 4.3 శాతం పడిపోయి రూ. 3,350 కోట్లకు చేరుకుంది. అయితే వడ్డీ మరియు పన్నులకు (ఈబీఐటీ) ముందు ఆదాయాలు 2.7 శాతం పెరిగి రూ. 634 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగంలో ఆదాయం 13.5 శాతం క్షీణించి రూ. 3,801 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈబీఐటీ 22.5 శాతం తగ్గి రూ .945 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో ఫుడ్స్ అండ్ రీఫ్రెష్‌మెంట్ విభాగంలో ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతం క్షీణతతో రూ. 1,788 కోట్ల రూపాయలు అని సంస్థ వెల్లడించింది.

Tags : hindustan uniliver limited, hul results, hul q4 results, covid-19, coronavirus, corona effect on hul

Advertisement

Next Story

Most Viewed