రాయల్స్‌ ముందు భారీ స్కోరు

by Shyam |   ( Updated:2020-09-27 12:34:20.0  )
రాయల్స్‌ ముందు భారీ స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-కేఎల్ రాహుల్ పెను విధ్వంసాన్ని సృష్టించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్తాన్ రాయల్స్‌ ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌కు తెరలేపారు. 16 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థి బౌలర్లను మైదానంలో పరిగెత్తించారు.

ముఖ్యంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(106) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 106 పరుగులు చేసి స్కోరు బోర్డును కూడా పరిగెత్తించాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ (69) తన దైన శైలిలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 16 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా ఈ ఓపెనర్లు ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు.

కాగా, 183 పరుగుల వద్ద టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన మయాంక్ శ్యామ్స‌న్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే 194 పరుగుల వద్ద కేఎల్ రాహుల్.. రాజ్‌పుత్ బౌలింగ్‌లో బౌండరీకి ట్రై చేసి శ్రేయస్‌ గోపాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారీ స్కోర్ 194 వద్ద పంజాబ్ రెండు వికెట్లు (ఓపెనర్లు)ను కోల్పోయింది. వన్‌డౌన్ వచ్చిన మ్యాక్స్‌వెల్(13), నికోలస్ పూరన్ (25) పరుగులు చేయడంతో నిర్దిష్ఠ 20 ఓవర్లలో పంజాబ్ 223 పరుగులు చేయగలిగింది.

స్కోరు బోర్డు:

Kings XI Punjab: లోకేష్ రాహుల్ (C, WK) (c) శ్రేయస్ గోపాల్ (b) రాజ్‌పుత్ 69(54), మయాంక్ అగర్వాల్ (c) శ్యామ్సన్ (b) టామ్ కుర్రాన్ 106(50), మ్యాక్స్‌వెల్ నాటౌట్ 13(9), నికోలస్ పూరన్ 25 (8) ఎక్స్‌ట్రాలు.. 10, మొత్తం స్కోరు: 223

వికెట్ల పతనం: 183/1 (మయాంక్ అగర్వాల్, 16.3), 194-2 (లోకేశ్ రాహుల్, 17.6).

బౌలింగ్: జయదేవ్ ఉనద్కట్ 3-0-30-0, అంకిత్ రాజ్‌పుత్ 4-0-39-1,
జోఫ్రా ఆర్చర్ 4-0-46-0, శ్రేయస్ గోపాల్ 4-0-44-0, టి. రాహుల్ 1-0-19-0, టామ్ కుర్రాన్ 4-0-44-1

Advertisement

Next Story

Most Viewed