నదిలోకి దూసుకెళ్లిన జీపు.. పదిమంది గల్లంతు

by Anukaran |   ( Updated:2021-04-23 03:30:15.0  )
drowned in the river
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ జీపు గంగా నదిలోకి దూసుకెళ్లింది. దీంతో జీపులో ఉన్న పదిమంది గల్లంతయ్యారు. ఈ ఘటన పట్నా జిల్లా పీపాపుల్ వద్ద శుక్రవారం జరిగింది. అయితే.. ప్రమాద సమయంలో జీపులో మొత్తం 15 మంది ఉండగా.. ఐదుగురు క్షేమంగా బయటపడ్డట్టు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story