- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavyrains: వరదలతో పాత చెరువుకు భారీ గండి..
దిశ, కొత్తగూడ : కార్లాయి గ్రామంలోని దాదాపు 350 ఎకరాలకు పైగా నీరందిస్తున్న పాత చెరువు వరద ఉధృతి తట్టుకోలేక కట్ట తెగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడ మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పాత చెరువుకు గండి పడింది.
మరమ్మత్తుకు నోచుకోని చెక్ డ్యాం…
కార్లాయి గ్రామంలోని పాత చెరువు వద్ద దాదాపు 30 ఏండ్ల కిందట చెక్ డ్యాం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి పాత చెరువు కింద ఉన్న ఆయకట్టు చాలా ఏండ్లుగా సేవలందించింది. ఏండ్లు గడుస్తుండటంతో క్రమ క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. చెరువు ఆయకట్టు రైతులు పలు మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మోర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి బస్తాలతో కప్పినా ఆగట్లే…
పాత చెరువుకి వరద ఉధృతి పెరగడంతో పాటుగా చెక్ డ్యాం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మట్టి నింపిన బస్తా సంచులతో మూసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తూము పక్కన మట్టి కొట్టుకుపోవడంతో పెద్ద గండి పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు నిల్వ ఉండకుంటే పంట పండే పరిస్థితి లేదని, కూలీలుగా మారాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పాత చెరువు చెక్ డ్యాం మరమ్మతు పనులు చేయించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.