‘హక్కుల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం’

by Shyam |   ( Updated:2021-01-02 10:37:19.0  )
‘హక్కుల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం’
X

దిశ, ముషీరాబాద్: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా హక్కుల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ, వాటి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టీస్ చంద్రయ్య పిలుపునిచ్చారు. బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మీడియా డైరీ-2021ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జస్టీస్ చంద్రయ్య మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పరిరక్షించడమంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడే జర్నలిస్టులకు కష్టాలు సహజమేనని, అధైర్య పడకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడే సమాజంలో వారికి మంచి గుర్తింపు, ప్రజల్లో విశ్వాసం దక్కుతుందన్నారు. మంచి సమాచారంతో డైరీని రూపొందించిన టీయూడబ్ల్యూజే ను ఆయన అభినందించారు.

Advertisement

Next Story