- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా టైం.. ఆక్సిమీటర్ ఇలా ఉపయోగించండి
దిశ, ఫీచర్స్ : దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా.. పల్స్ ఆక్సిమీటర్ కోసం డిమాండ్ పెరుగుతోంది. కరోనా వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుండటంతో రోగి రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చూపే పల్స్ ఆక్సిమీటర్ల ఉపయోగం పెరిగింది. అనేక నివేదికల ప్రకారం.. ఆక్సిజన్ లెవల్స్ 95 శాతం లేదా అంతకంటే ఎక్కువగా నమోదైతే సాధారణ స్థాయిలో ఉన్నట్టు లెక్క. వైద్యుల సూచన ప్రకారం 92 శాతం కంటే తక్కువగా నమోదైతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఈ మేరకు పల్స్ ఆక్సిమీటర్‌ను ఉపయోగించడంపై కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
– పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగించే సమయంలో వేలుపై హెన్నా లేదా నెయిల్ పాలిష్ ఉండకూడదు.
– చేతులు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండాలి. ఒకవేళ చల్లగా ఉన్నాయనిపిస్తే వాటిని రబ్ చేయాలి.
– పల్స్ ఆక్సిమీటర్ పెట్టడానికి ముందు కాసేపు విశ్రాంతి తీసుకుని శరీరాన్ని రిలాక్స్ చేయాలి.
– ఇండెక్స్ లేదా మిడిల్ ఫింగర్‌కు మాత్రమే ఆక్సిమీటర్ ఉపయోగించాలి.
– చాతి వరకు చేయిని తీసుకెళ్లాలి.
– ఆక్సిమీటర్‌ను నిమిషం పాటు వేలికి ఉంచి, రీడింగ్ చూడాలి.
– ఆక్సిజన్ స్థాయి రీడింగ్స్‌లో ఐదు సెకన్ల పాటు ఎలాంటి మార్పు రాకపోతే అదే రికార్డ్ నమోదు చేయాలి.
అయితే, మీ ఆరోగ్య పరిస్థితి లేదా ఆక్సిజన్ స్థాయిని అంచనా వేయడానికి పల్స్ ఆక్సిమీటర్‌పై మాత్రమే ఆధారపడొద్దు. వైద్యుడి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి. ఇక ఆక్సిజన్ స్థాయి 92 శాతానికి తగ్గినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.