నోరూరించే హైదరాబాద్ బావార్చి బిర్యానీ ఇంట్లోనే….

by Anukaran |   ( Updated:2020-08-08 11:52:31.0  )
నోరూరించే హైదరాబాద్ బావార్చి బిర్యానీ ఇంట్లోనే….
X

కరోనా లాక్ డౌన్… నచ్చిన రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ తినే అవకాశం లేకుండాపోయింది. కొన్ని రెస్టారెంట్లు (restaurants) కరోనా నిబంధనలు పాటిస్తున్నాం. హైజీన్ (hygiene) గా వంటలు తయారు చేస్తున్నాం. అని ప్రకటనలు ఇస్తున్నా ధైర్యం చేసి రెస్టారెంట్లకు వెళ్లలేని, ఫుడ్ తెచ్చుకోలేని పరిస్థితి.

చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు (Non-veg lovers) మోస్ట్ ఫేవరిట్ లిస్ట్ లో బిర్యానీ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉండే ఒరిజినల్ బావార్చి బిర్యానీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకే బావార్చి మటన్ బిర్యాని (bawarchi mutton biryani) ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో “దిశ” వీక్షకుల కోసం తెలుపబోతున్నాం.

అరకేజీ మటన్, లవంగాలు-8, దాల్చిన చెక్క- 1 అంగుళం ముక్క, షాజీరా – 1 టీ స్పూన్, యాలకులు-4, అల్లంవెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్స్, పచ్చి బొప్పాయి పేస్ట్- 2 టేబుల్ స్పూన్స్, పలచటి పెరుగు – అరకప్పు, కారం- 2 స్పూన్లు, పచ్చి మిర్చి పేస్ట్ – 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడా, నూనె- 4 టేబుల్ స్పూన్స్, చిన్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా తీసుకుని వీటన్నిటిని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత బాగా మరిగిన చిన్న టీ కప్పుడు వాటర్ పోసి మళ్ళీ బాగా కలిపి పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 లీటర్ల వరకు నీరు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో 4 యాలకులు, 7-8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు వేయాలి. నీరు బాగా తెర్లుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి బియ్యం (basmati rice) యాడ్ చేయాలి. రైస్ సగం ఉడికాక మటన్ మారినేషన్ పైన మొదటి లేయర్ గా వేసుకోవాలి. రైస్ ఇంకొక 2 ని.లు కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ వేయాలి. ఇదే విధంగా రైస్ మొత్తం మరొక 2 లేయర్స్ గా వేసుకోవాలి. లేయర్స్ వేయడం కంప్లీట్ అయ్యాక పైన కలర్ కోసం పసుపు కలిపిన నీళ్లు కొద్దిగా రైస్ చుట్టూరా పోయాలి. కావాలంటే ఈ స్టేజ్ లో నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు.

ఇప్పుడు ఆ గిన్నెను దమ్ పెట్టి కవర్ చేసుకుని స్టవ్ మీద 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, ఇంకొక 10-15 మినిట్స్ సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే మూత తీయకుండా ఒక అరగంట తర్వాత తీసి రైస్ నుండి అడుగు భాగం నుండి కదుపుతూ లైట్ గా మిక్స్ చేసుకోవాలి. అంతే… నోరూరించే వేడి వేడి బావార్చి మటన్ బిర్యానీ రెడీ…!!

Advertisement

Next Story