- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6 ఫీట్ డిస్టెన్స్‌కు సింపుల్ చిట్కాలు
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. కేసులు అంతకంతకూ పెరుగుతూ ఆందోళనను పెంచుతున్నాయి. రాష్ట్రంలో వారం కిందటి వరకు రోజుకు 150కు పైగా కేసులు నమోదవగా.. మొన్నటి వరకు డబుల్ సెంచరీ క్రాస్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 300 దాటాయి. ఈ తరుణంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదనేది థంబ్ రూల్ అయితే.. వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి. ఒకరికొకరు 6 అడుగుల(1.8 మీటర్లు) దూరం ఉంటేనే కరోనాను రాకుండా అడ్డుకోగలం. ఎందుకంటే రెస్పిరేటరీ డ్రాప్‌లెట్స్ కనీసం 1.8 మీటర్ల వరకు ట్రావెల్ చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో 6 అడుగుల దూరాన్ని ఎలా కొలవాలి?
సింపుల్ టెక్నిక్..
ఇమేజినేషన్ అవసరం లేదు. చక్కగా రెండు చేతులను ఇరువైపులా చాచితే చాలు.. మధ్య వేలు చివరి కొన నుంచి .. మరో మధ్య వేలు కొస వరకు మన హైట్ ఎంత ఉంటుందో.. దాదాపుగా ఆ రెండు చేతుల మధ్య దూరం కూడా అంతే ఉంటుంది. సో ఆ లెక్కన 6 ఫీట్ల దూరాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
ఇంట్లో అయితే..
చాలా మంది ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 3 సీటర్ సోఫా.. దాదాపు 6 అడుగులుంటుంది. సో.. దాన్ని బేస్ చేసుకుని మనం ఒకరి నుంచి మరొకరికి 6 అడుగుల దూరం ఉండొచ్చు. ఇమాజిన్ చేసుకోవడంలో మీరు ఎక్స్‌పర్ట్ అయితే.. బయటకు వెళ్లినప్పుడు.. ఒక్కసారి ఆ 3 సీటర్ సోఫాను ఇమాజిన్ చేసుకుని… ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
సూపర్ మార్కెట్‌లో..
కరోనా భయం ఉన్నా.. ఇంట్లో సరుకుల కోసమైనా సూపర్ మార్కెట్‌కు అయితే వెళ్లక తప్పదు. అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించడం కాస్త కష్టమే అయినా .. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలి. గ్రాసరీ స్టోర్‌లో తప్పకుండా షాపింగ్ కార్ట్స్ ఉంటాయి. అవి ఒక్కోటి దాదాపు మూడు అడుగుల పొడవుంటాయి. అంటే రెండు షాపింగ్ కార్ట్స్ జత చేస్తే 6 అడుగులకు లెక్క సరిపోతుంది. సో ఈ సారి గ్రాసరీ స్టోర్ లేదా సూపర్ మార్కెట్‌కు వెళితే.. ఆ కార్ట్ ఆధారంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
కారు కూడా..
సెడాన్ కారు కూడా.. 6 అడుగుల పొడవుంటుంది. సో బయటకు ఎక్కడికి వెళ్లినా కార్లు అయితే తప్పకుండా కనిపిస్తాయి. సో ఆ కారే మనకు 6 ఫీట్ల దూరానికి కొలమానం.