భారీ ప్రమాదం నుంచి ఆ డ్రైవర్ ఎలా బయటపడ్డాడు?

by vinod kumar |
భారీ ప్రమాదం నుంచి ఆ డ్రైవర్ ఎలా బయటపడ్డాడు?
X

దిశ, స్పోర్ట్స్ : బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఫార్ములా వన్ డ్రైవర్ రోమైన్ గ్రోస్యెన్ కారు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అత్యంత వేగంతో ఉన్న ఆ కారు మరో కారుకు తగిలి అనంతరం బ్యారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు కాక్‌పిట్, ఛేసిస్ రెండు భాగాలుగా విడిపోవడమే కాకుండా భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదాన్ని చూసిన వాళ్లు డ్రైవర్ బతికుండే అవకాశమే లేదని అందరూ బావించారు. కాని క్షణాల వ్యవధిలో డ్రైవర్ రోమైన్ కారు నుంచి దిగి బారికేడ్లను దాటి నడుచుకుంటూ వచ్చాడు. అంత ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడని ప్రపంచమంతా చర్చించుకుంది.

అయితే అతడు అలా బయటపడటానికి ‘హాలో’ అనే రక్షణ పరికరమే కారణమంటా. టైటానియంతో తయరు చేసే ఈ పరికరం ఫార్ములా వన్ కార్లలో డ్రైవర్‌కు ఎదురుగా అమర్చుతారు. మూడు భాగాలను కలపి భిగించే ఈ పరికరం కారణంగా ఘోర ప్రమాదాల నుంచి డ్రైవర్లు బయటపడతారు. ఈ పరికరం రెండు ఏనుగుల బరువును కూడా మోయగలిగేంత దృఢంగా ఉంటుంది. 2018లో ఈ పరికరాన్ని వినియోగంలోనికి తెచ్చినప్పుడు రోమైన్ గ్రోస్యెన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు అదే అతడి ప్రాణాలను రక్షించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed