- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితమంతా గర్భంతో ఉండే జీవి
దిశ, వెబ్‌డెస్క్:
కంగారు జాతికి చెందిన స్వాంప్ వాల్లబీ అనే జంతువు యుక్తవయస్సు నాటి నుంచి మొదలై చనిపోయేవరకు గర్భంతోనే ఉంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఒక బిడ్డ జననానికి రెండు మూడు రోజుల ముందే మరో బిడ్డకు కడుపులో రెడీ అవుతుందని వారి అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, బెర్లిన్‌లోని లూబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జూ అండ్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ వారు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఈ విషయాలు తెలిశాయి.
ఎలా సాధ్యం?
ఆడ వాల్లబీలు, కంగారూలలో రెండు గర్భసంచులు ఉంటాయి. ఆ రెండింటిలోనూ వేరువేరుగా అండాల ఉత్పత్తి జరుగుతుంది. ఒక గర్భసంచిలో పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందగానే మరో గర్భసంచిలో పిండం ప్రారంభమవుతుంది. అయితే కంగారూలలో పిండం డెలివరీ అయిన తర్వాత ఇంకో పిండం ప్రారంభమవుతుంది. కానీ వాల్లబీలలో బిడ్డ డెలివరీ కాకముందే మరో పిండం అభివృద్ధి మొదలవుతుంది. పది ఆడ స్వాంప్ వాల్లబీల మీద హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ ద్వారా పరిశోధన చేసి పరిశోధకులు ఈ దృగ్విషయాన్ని కనిపెట్టారు.
తర్వాత ఏం జరుగుతుంది?
ఒక బిడ్డ కడుపులో ఉండగానే మరో బిడ్డ అభివృద్ధి ప్రారంభమయ్యే లెక్కన చూస్తే ప్రతి 30 రోజులకు వాల్లబీ ఒక బిడ్డకు జన్మనివ్వాలి. కానీ కొత్తగా ఏర్పడిన పిండం అభివృద్ధిని కొద్దిరోజులు ఆపివేయగల మెకానిజం వాల్లబీలకు ఉంది. దీన్ని ఎంబ్రియోనిక్ డిస్పాస్ అంటారు. బిడ్డ డెలివరీకి అనుకూలంగా ఉండే వాతావరణం అంటే కాలం, ఆహార సౌకర్యాలు వంటివి సరిగా ఉన్నపుడే వాటికి జన్మనివ్వడానికి వాల్లబీలు సిద్ధపడతాయి.
మరేదైనా జంతువు ఉందా?
లేపుస్ యురోపియస్ అని పిలిచే యూరోపియన్ గోధుమ కుందేలుకి కూడా ఇలాంటి ప్రవర్తనే చూపిస్తుంది. కాకపోతే దీనిలో ఒకే గర్భసంచిలో రెండు పిల్లలు పెరిగే స్థలం ఉంటుంది. కానీ ఇది కొంత వయసు వచ్చే వరకే పిల్లలను కనగలదు. కానీ వాల్లబీలు తమ జీవితాంతం గర్భంతోనే ఉంటాయి.
ఈ పరిశోధన వల్ల ఉపయోగం?
క్షీరదాల్లో ఇలాంటి విభిన్న ప్రత్యుత్పత్తి దృగ్విషయాలను అధ్యయనం చేయడం వల్ల మానవుల్లో పిల్లల కోసం ప్రయత్నించే వారికి సాయం చేయొచ్చు. అలాగే క్షీరద పిల్లల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేయడం ద్వారా గర్భస్థ రోగాలేవైనా వచ్చినపుడు వాటికి మందు కనిపెట్టడంలో ఈ పరిశోధన ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ మెంజీస్ తెలిపారు.
Tags: wamp Wallaby, Kangaroos, Life long pregnant, Mammals, Lactating mammals, European Hare