షోరీల్ యాప్‌తో వీడియో ‘రెజ్యూమే’

by Shyam |
షోరీల్ యాప్‌తో వీడియో ‘రెజ్యూమే’
X

దిశ, ఫీచర్స్ : ఏ రంగంలో ఉద్యోగం కావాలన్నా.. ముందుగా క్వాలిఫికేషన్‌తో పాటు బయోడేటాను సూచించే ‘రెజ్యూమే’ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. జాబ్ పొందడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. చాలావరకు ‘రెజ్యూమే’ను టెక్ట్స్ ఫార్మాట్‌లోనే సబ్మిట్ చేస్తుండగా.. కొందరు ‘వీడియో రూపం’లోనూ ప్రిపేర్ చేస్తుంటారు.

ఇందుకోసం హాట్-మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా.. కొత్తగా వీడియో యాప్ ‘షోరీల్‌’( Showreel)‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఈ యాప్ జాబ్ అప్లికేషన్స్ కోసం సహజమైన వీడియో రెజ్యూమేలను ప్రిపేర్ చేయడమే కాక స్టార్టప్ ఆలోచనల్ని పొందేందుకు లేదా కొలాబరేషన్ పార్ట్‌నర్‌ను కనుగొనేందుకు కూడా ఉపయోగించవచ్చు.

షో రీల్‌తో ఉద్యోగార్థులు.. మెంటార్స్ లేదా కంపెనీ రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు ప్రతిస్పందనగా వారి సొంత ప్రొఫెషనల్ వీడియోలను రూపొందించుకోవచ్చు. ఈ ప్రశ్నలు వృత్తిపరమైన, వ్యక్తిగత, వ్యవస్థాపక వృద్ధికి సంబంధించిన గైడ్‌లైన్స్ కోసం వెతుకుతున్న వ్యక్తులు అందుకు తగ్గట్లు సిద్ధమయ్యేందుకు, స్వీయ-అభివృద్ధికి అవకాశం కల్పిస్తాయి. ఈ వీడియోలను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ షేర్ చేయొచ్చు.

ప్రొఫెషనల్ షోరీల్స్‌.. ఉద్యోగ అన్వేషకులు తమను తాము మార్కెట్ చేసుకోవడానికి, తమ డ్రీమ్ జాబ్ పొందేందుకు వీలు కల్పిస్తుంది. 20 మందితో కూడిన భారతీయ బృందం రూపొందించిన ఈ యాప్‌.. ప్లే స్టోర్ (iOS), గూగుల్ ప్లే(Android)లో అందుబాటులో ఉంది. షోరీల్ అభ్యర్థులను వేగంగా ఫిల్టర్ చేయడంలో సాయపడటం ద్వారా రిక్రూట్‌మెంట్ సమయాన్ని తగ్గిస్తోంది.

కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే..

వ్యక్తుల్లోని ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు ఇదొక మంచి ప్లాట్‌ఫామ్. రాబోయే 10 ఏళ్లలో కాబోయే యజమానికి రెజ్యూమేను పంపేందుకు బదులు మీరు మరింత ప్రభావవంతమైన వీడియో లేదా వీడియోను సూచించే QR కోడ్‌ను పంపే అవకాశమే ఎక్కువుంది. సంభాషణలను సజీవంగా తీసుకురావడంతో పాటు ఉద్యోగ అన్వేషకులు, కంపెనీలకు నిజమైన విలువను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించాం.

బిలియన్ నిరుద్యోగులకు సాయపడేందుకు మా వంతు ప్రయత్నం ఇది. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ద్వారా ఉద్యోగాన్ని ఆశించే వ్యక్తి గురించి మీకు ఏమీ తెలియకపోవచ్చు. ఒక చిత్రం కొన్ని విషయాలే చెబుతుంది. కానీ ఒక వీడియో మాత్రం అతని కంప్లీట్ డీటెయిల్స్ అందించగలదు. ఇది ఉపాధికి మాత్రమే కాకుండా వ్యాపార పరస్పర చర్యకు ఉత్తమంగా ఉంటుందని సీరియల్ టెక్‌ప్రెన్యూర్ సబీర్ భాటియా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed