- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today's Horoscope : నేటి రాశిఫలాలు
మేష రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి అనుకుంటారు. కానీ మీ ఆలోచనలు ముందుకు సాగవు. కొన్ని కుటుంబ పరమైన సమస్యలు ఎదురవుతాయి.
వృషభ రాశి : స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి అనుకునేవారికి నేడు బాగుంటుంది. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంతం పెట్టడానికి ప్రయత్నించకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేడు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు కానుంది.
మిథున రాశి : ఈరోజు మీరు అదృష్టం కలిసి వస్తుంది. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి ప్రాధన్యతనివ్వండి. ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ చెప్పింది వినండి. అదే మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
కర్కాటక రాశి :ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
సింహ రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఈ సారి మీరు ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. లేనిచో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.
కన్యా రాశి : వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. వృత్తి నిపుణులు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది.
తుల రాశి : మీకు చాలా ఇష్టమైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో, వాటిని కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి
వృశ్చిక రాశి : మీరు నేడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మిమ్ముల్ని టెన్షన్‌కు గురి చేస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. అయినప్పటికీ అతి ఖర్చులు లేదా అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం.
ధనస్సు రాశి : నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తాయి.
మకర రాశి : దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. మీ ఇంట్లో సామరస్యత కోసం, పనిని పూర్తి సహకారంతో జరగాలి. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు తీసుకోవడం వలన మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుతాయి. వైద్యరంగంలో ఉన్నవారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
కుంభ రాశి : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారో, వారు కాస్త ఆలోచించి అడుగు వేయడం మంచిది.
మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు మొత్తం చాలా బజీగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చేరోజుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి నేడు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.అనుకోని అతిధి అనుకోనివిధంగా మీ ఇంటికి వస్తారు.కావును మీరు మీధనాన్ని ఇంటి అవసరాలకొరకు ఖర్చుచేయవలసి ఉంటుంది.