సీఎం సహాయ నిధి పేదలకు వరం.. ఎమ్మెల్యే

by Sumithra |
సీఎం సహాయ నిధి పేదలకు వరం.. ఎమ్మెల్యే
X

దిశ, మదనాపురం : సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని దేవర కద్ర ఎంఎల్ఏ జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అజ్జకొల్లు గ్రామనికి చెందిన భారతయ్య, గండే సంబంధించిన ఆపరేషన్ కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 4 లక్షల రూపాయల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ధైర్యాన్నిస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనాపురం మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాదేవన్ గౌడ్, కావలి సాయిబాబా, రామస్వామి, కావలి రాజు, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed