Vishnuvardhan: గద్దర్‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి తేడా లేదు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-28 07:53:03.0  )
Vishnuvardhan: గద్దర్‌కు ఎల్టీటీఈ తీవ్రవాదికి తేడా లేదు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: గద్దర్‌ (Gaddar)కు ఎల్టీటీఈ (LTTE) తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని బీజేపీ (BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డు (Padma Awards)ల విషయంలో తెలంగాణ (Telangana) ప్రముఖులకు అన్యాయం జరిగిందని సోమవారం ఓ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కామెంట్ చేశారు. అందుకు కౌంటర్‌గా ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో బీజేపీ (BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్‌ (Gaddar)కు ఎల్టీటీఈ (LTTE) తీవ్రవాదికి పెద్దగా తేడా ఏమి లేదని అన్నారు.

అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ (Gaddar) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ బద్ద వ్యతిరేకి అని ఫైర్ అయ్యారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ఎల్టీటీఈ (LTTE)కి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అంటారా అని ఆక్షేపించారు. లేక ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని పురస్కారం ఇవ్వాలా అని సెటైర్లు వేశారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

కాగా, గద్దర్‌(Gaddar)కు పద్మ అవార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్‌ను బండి సంజయ్ (Bandi Sanjay) ఇప్పటికే కొట్టిపడేశాడు. తెలంగాణ (Telangana) రాష్ట్ర పౌరులతో పాటు పోలీసులు, అమాయకులను కాల్చి చంపిన మవోయిస్టు (Maoist) నేతలకు సపోర్ట్‌గా నిలిచిన గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారని కామెంట్ చేశారు. గద్దర్ తెలంగాణ కోసం ఏ మేలు చేయలేదని.. ఓ వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేలా పాటలు పాడాడని అలాంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పద్మ అవార్డ్ ఇవ్వబోమని బండి సంజయ్ (Bandi Sanjay) తేల్చి చెప్పారు.

Next Story

Most Viewed