Attack: బరితెగించిన కోడిపందేల నిర్వాహకులు.. ఏకంగా ఎస్సైపై దాడికి యత్నం (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2025-01-16 14:28:55.0  )
Attack: బరితెగించిన కోడిపందేల నిర్వాహకులు.. ఏకంగా ఎస్సైపై దాడికి యత్నం (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు గత నాలుగు రోజులుగా జోరుగా కొనసాగుతున్నాయి. పందేలను నిర్వహించకూదని ఆంక్షలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, లోకల్ లీడర్లు బరులు గీసి మరీ రూ.‌కోట్లలో పందేలు కాస్తున్నారు. గ్రామ శివార్లలోని ఫామ్‌హౌజ్‌ (Farm Houses)లు, వ్యవసాయ పొలాల్లో కోడి పందేలకు వేదికగా మారాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

జక్కంపూడి (Jakkampudi) కాలనీ పరిధిలోని పాములు కాల్వ (Pamula Kalva) సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరులు సమయం దాటిపోయిందని.. కంట్రోల్ చేసేందుకు వచ్చిన వన్ టౌన్ ఎస్సై హరి ప్రసాద్ (SI Hari Prasad) వెళ్లారు. అందరినీ అక్కడి నుంచి పంపేస్తుండగా.. ఒక్కసారిగా కోడి పందేల నిర్వాహకులు ఆయనపై తిరగబడి దాడికి యత్నించారు. అయితే, అల్లరి మూకలను దాడిని ఎస్సై హరి ప్రసాద్ సమర్ధవంతంగా తిప్పి కొట్టారు. దీంతో చేసేదేమి లేక కోడిపందేల నిర్వాహకులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం ఎస్సైపై కోడి పందేల నిర్వాహకులు దాడికి యత్నించిన వీడియో ఘటన సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed