Bomb Threat: నాచారంలో కలకలం.. ఆ స్కూల్‌కు మరోసారి బాంబు బెదిరింపు

by Ramesh N |
Bomb Threat: నాచారంలో కలకలం.. ఆ స్కూల్‌కు మరోసారి బాంబు బెదిరింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని (Nacharam) నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్)‌కు మరోసారి (Bomb Threat) బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లో బాంబు పెట్టామని మెయిల్ ద్వారా బెదిరింపులు చేశారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ స్కూల్ మొత్తం తనిఖీలు చేపట్టింది. ఇక ఈ నెలలో ఇది రెండోసారి డీపీఎస్‌కు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. దీంతో బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది అకతాయి చేస్తున్న బెదిరింపులుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, గతంలో కూడా (Delhi Public School) ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు వచ్చిన బాంబు బెదిరింపు బూటకమని తేలింది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందం క్యాంపస్‌కు వెళ్లి స్కూల్ మొత్తం సోదాలు నిర్వహించిన ప్పటికీ ఏమీ కనుగొనలేక పోయింది.

Advertisement
Next Story

Most Viewed