- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పింక్ శారీలో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. ఇంత ఏజ్ వచ్చినా ఆ విషయంలో ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Sharan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘ఇష్టం’(Istam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు మంచి క్రేజ్‌ను అందుకుంది. హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.
ఇక కేరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి ఆమె యూత్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ‘మనం’(Manam) మూవీ వరకు సక్సెస్ ట్రాక్‌ను మెయింటైన్ చేసిన ఈ అమ్మడు ఫారిన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయ్యింది. అయితే వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకు ఒక పాప కూడా పుట్టింది. ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఈ భామ సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూనే ఉంది.
తన వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తునే ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రియ శరన్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. అలాగే ఈ ఫొటోస్‌కి.. ‘ఆయియే రామ్ జీ అనే అందమైన పాటలో భాగం కావడం ఒక అద్భుతమైన అనుభవం.. కొన్ని అందమైన తెరవెనుక క్షణాలను పంచుకుంటున్నాను’ అంటూ లవ్ సింబల్ జోడించింది.
దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇంత ఏజ్ వచ్చినా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు.. యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.