Banks: మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే

by Vennela |   ( Updated:2025-01-16 05:48:54.0  )
Banks: మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే
X

దిశ, వెబ్‌డెస్క్: Banks: బ్యాంకింగ్ సెక్టార్ లో కేంద్రం ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. చిన్న బ్యాంకులు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంకింగ్( Banks) సెక్టార్ లో కేంద్రం ప్రభుత్వం(Central Government) ఎన్నో సంస్కరణలను తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. చిన్న బ్యాంకులు(Small banks) ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో కీలక మార్పునకు భారత ప్రభుత్వం రెడీ అయ్యింది. కొన్ని నివేదికల ప్రకారం 5 ప్రభుత్వ రంగ బ్యాంకు(5 public sector banks)ల్లో ప్రభుత్వం తన వాటా తగ్గించుకునే ఛాన్స్ ఉంది. వీటిలో వాటాను పెద్ద పెట్టుబడిదారులకు విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

యూకో బ్యాంక్(UCO Bank), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(Indian Overseas Bank), పంజాబ్ అండ్ సింధ్(Punjab and Sindh), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) బ్యాంకులో భారత ప్రభుత్వం పెట్టుబడి అండే పబ్లిక్ అసెట్ మెనేజ్ మెంట్ విభాగం ద్వారా వాటాలను విక్రయించే అశకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంకులు పెద్ద పెట్టుబడిదారులకు వాటాలను విక్రయిండం మరో ఆప్షన్ ఉంది. ఈ బ్యాంకుల్లో ప్రభుత్వం హోల్డింగ్(Government holding) ను 75శాతం కంటే తక్కువకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యాంకుల వాటాను ఎలా తగ్గించినా సరే ఖాతాదారులపై ఏమాత్రం ప్రభావం పడదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా క్వాలిటీ సర్వీసు(Quality service)లపై ఫోకస్ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

క్యాపిటల్ మార్కెట్ ను యాక్సెస్ చేయడంతో ఈ బ్యాంకుల లిక్విడిటీ(Banks' liquidity) మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. వాటి రుణ సామార్థ్యాన్ని పెంచేందుకు వీలుంటుంది. ఆర్ధిక వృద్ధి మందగించిన నేపథ్యంలో బ్యాకింగ్ రంగం ఆస్తుల నాణ్యత(Banking sector asset quality) గరిష్ట స్థాయికి చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక వృద్ధి మందగించిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం అసెట్ క్వాలిటీ గరిష్ట స్థాయికి చేరుకుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో మరిన్ని లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకులకు వీలు కల్పిస్తుంది.

ఈ వార్తల నేపథ్యంలో యూకో బ్యాంక్(UCO Bank) షేర్లు 20శాతం పెరగాయి. 2003 అక్టోబర్ నుంచి మొదటిసారిగా ఈ బ్యాంక్ షేర్లు భారీగా పెరిగాయి. ఇదే బాటలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్(Indian Overseas Bank) షేర్లు కూడా పెరుగుదల కనిపించింది. 2009 మే నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో బ్యాంక్ స్టాక్(Bank stock) పెరగడం ఇదే మొదటిసారి. గతేడాది కాలంగా బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా రాణించడం లేదు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed