Income Tax Return: ఈ రూల్‌ తెలుసుకుంటే రూ.50 వేలు ఆదా.. బ్యాంక్‌ అకౌంట్ ఉంటే చాలు

by Vennela |
Income Tax Return: ఈ రూల్‌ తెలుసుకుంటే రూ.50 వేలు ఆదా.. బ్యాంక్‌ అకౌంట్ ఉంటే చాలు
X

దిశ, వెబ్‌డెస్క్: Income Tax Return: మనలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్(Bank Account) తప్పనిసరిగా ఉంటుంది. నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే సేవింగ్స్ అకౌంట్ పై వచ్చే వడ్డీపై ట్యాక్స్(Tax) చెల్లించాల్సి ఉంటుందన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే మీ ఈ విషయం తెలిస్తే ట్యాక్స్ ఆదా రూపంలో రూ. 10వేల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(Income tax return) దాఖలు చేసేటప్పుడు మీరు మీ సేవింగ్స్ అకౌంట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఇప్పుడు మనం సేవింగ్స్ అకౌంట్స్(Savings Accounts) పై వచ్చే వడ్డీపై పన్ను ఎలా ఆదా చేసుకోవాలో..ఏ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే..మీరు సెక్షన్ 80 టీటీఏ గురించి తెలుసుకోవాలి. ఈ సెక్షన్ కిందనే మీరు సేవింగ్స్ అకౌంట్స్ పై వచ్చే వడ్డీ మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు(Tax exemption) పొందవచ్చు. డిడక్షన్ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు.

అంతేకాదు సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్స్(Senior Citizens) కు రూ. 50వేల వరకు తగ్గింపు ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులపై వచ్చే వడ్డీ మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు రూపంలో ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే సాధారణ ట్యాక్స్ పేయర్స్(Taxpayers) అయితే సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా వచ్చే వడ్డీ మొత్తంపై సెక్షన్ 80 టీటీఏ కింద రూ. 10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

ఇండివిడ్యువల్స్, హెచ్ యూఎఫ్ ఈ సెక్షన్ కింద ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఎన్ఆర్ఐలకు కూడా ఈ ప్రయోజనం ఉంటుంది. అయితే కండిషన్స్ ఉంటాయి. వీరికి ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అయితే ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త ట్యాక్స్ విధానా(New tax policy)న్ని ఎంచుకుంటే ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. కేవలం పాత పన్ను విధానం ఎంచుకున్న వారికే ఇలా సేవింగ్స్ అకౌంట్స్ పై అర్జించిన మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

బ్యాంక్ కో ఆపరేటివ్ బ్యాంక్(Co-operative Bank), పోస్టాఫీస్ ఇలా మీరు ఎందులో అయినా సేవింగ్స్ అకౌంట్ ఉంటే..వచ్చే వడ్డీపై ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. మల్టీపుల్ సేవింగ్స్ అకౌంట్స్(Multiple Savings Accounts) పై కూడా ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే కేవలం రూ. 10వేలు మాత్రమే మినహాయింపు పొందవచ్చు. ఒక ఏడాదిలో గరిష్టంగా ఈ సెక్షన్ కింద రూ. 10వేల వరకు మాత్రమే ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. దీనికోసం మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇన్ కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద మీరు వడ్డీ రూపంలో పొందే ఆదాయాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.



Next Story