- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breast cancer: ఆడవాళ్లలోనే కాదు.. మగాళ్లలో కూడా రొమ్ము క్యాన్సర్.. లక్షణాలు గుర్తించకపోతే అంతే సంగతి?

దిశ, వెబ్‌డెస్క్: రొమ్ము క్యాన్సర్ (Breast cancer) ఎక్కువగా ఆడవాళ్లలో కనిపిస్తుంటుంది. ఈ సమస్య తలెత్తితే క్రమంగా కోర్స్ వాడుతుండాలి. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. చంకలలో ఉన్న ఒక ముద్ద లేదా ద్రవ్యరాశి, రొమ్ము ఆకారం(Breast shape), రూపంలో మార్పులు, చనుమొన నుంచి ఉత్సర్గ (Discharge), (blood) కూడా అండ్ రొమ్ములోని ఏదైనా భాగంలో నొప్పి (Breast pain) వస్తుండటం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది మహిళలు ఈ సమస్యతో ప్రాణాలు కోల్పోవడానికి కారణం.. రొమ్ము క్యాన్సర్ లక్షణాల్ని గుర్తించకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. లక్షణాల్ని గుర్తించి.. సరైన సమయానికి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తూనే ఉంటాం. కానీ మగాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రేర్ గా వింటాం. కానీ పరుషుకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
స్కిన్ ఎర్రగా మారడం(Redness of the skin), మసకబారడం (Fading), లేదా నారింజ తొక్క(orange peel)లాగా కనిపిస్తే మగాళ్లలో రొమ్ము క్యాన్సర్ అని గుర్తించాలని.. సందేహాలు ఉంటే ఆసుపత్రికెళ్లి వైద్యుల్ని సంప్రదించాలని చెబుతున్నారు. చెస్ట్ చాలా రోజుల వరకు నొప్పి పెట్టినా.. లైట్ తీసుకోకుండా డాక్టర్ కు చూపించుకోవాలి. చంకలో శోషరస గ్రంథుల్లో వాపు (Swelling lymph nodes) రావడం కూడా రొమ్ము క్యాన్సర్ కు సిగ్నలేనని అంటున్నారు నిపుణులు.
అయితే రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా యాభై ఏళ్ల పైబడిన వారిలో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే.. మరొకరికి వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే మెనోపాజ్ (Menopause) అనంతరం మద్యం అతిగా తాగడం(Excessive drinking of alcohol), వ్యాయామాలు (Exercises) చేయకపోవడం, స్మోకింగ్ చేయడం(Smoking), బరువు ఎక్కువగా ఉండడం (Being overweight) వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుందని పేర్కొంటున్నారు. కాగా సకాలంలో లక్షణాల్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.