living Grave : ఆ సమాధి తవ్వాల్సిందే : కేరళా హైకోర్టు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-17 07:10:30.0  )
living Grave : ఆ సమాధి తవ్వాల్సిందే : కేరళా హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ (Kerala) రాష్ట్రం తిరువనంతపురం(Thiruvananthapuram)లో ఓ వ్యక్తి జీవ సమాధి (living Grave) అంశం వివాదాస్పదంగా మారింది. అతడు నిజంగా జీవ సమాధి అయ్యాడా లేక కుటుంబ సభ్యులే జీవ సమాధి పేరుతో చంపేసి నాటకం ఆడుతున్నారా అన్న సందేహాల రేగడంతో స్థానికులు అతడి మరణంపై ఫిర్యాదు చేయగా పోలీసులు సమాధిని తవ్వడానికి వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. ఆ సమాధిని తవ్వాల్సిందేనని (Be Dug)ని హైకోర్టు(Kerala High Court) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతపురంకు చెందిన గోపన్ స్వామి అలియాస్ మణ్యన్(78) జీవ సమాధి అయ్యారని కొద్ది రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు. బంధువులు, స్థానికులకు తెలియకుండా అతన్ని నెయ్యటింకరలోని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఎవరూ చూడకుండా తనను సమాధి చేయాలని గోపన్ చెప్పినట్లు ఆయన కుమారులు సనందన్, రాజేశన్ చెబుతుండటం మిస్టరీగా మారింది. ఇందులో ఏదో మతలబు ఉందని స్థానికులతోపాటు, మృతుడి బంధువులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

ఎవరికీ తెలియకుండా గోపన్ స్వామి చనిపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. కనీసం బంధువులకైనా సమాచారం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మృతుడికి కంటి చూపు సరిగా లేదని అలాంటి వ్యక్తి తనకు తానుగా జీవ సమాధి ఎలా అవుతారని సందేహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాని మనిషి ఆకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారు.

తొలుత సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు. గోపన్ స్వామి భార్య, కుమారులు సమాధిని తవ్వడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. అయితే స్థానికులు మాత్రం సమాధిని తవ్వి తీరాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు న్యాయపరంగా ముందుకెళ్లారు. సమాధిని తవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతకుముందు తమ మత స్వేచ్చ..భౌతిక ఖననం నమ్మకాలను కాపాడాలని కూమారుడు సనందన్ హిందూ సంస్థలకు, కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సమాధి త్వవ్వకంపై స్టే ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సీఎస్.డయాస్ చనిపోయినట్లుగా చెబుతున్న వ్యక్తి మరణ దృవీకరణ పత్రాన్ని సమర్పించినట్లయితే నేను మీ వాదన అంగీకరిస్తానని..అతని మరణం ఎక్కడ నమోదైందని పిటిషనర్ ను ప్రశ్నించారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 194 ప్రకారం, అనుమానాస్పద స్థితిలో మరణం సంభవించినప్పుడు, హత్యగా సహేతుకమైన అనుమానం ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేసే హక్కు పోలీసులకు ఉందని, దీనిపై స్టే ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సమాధి త్రవ్వకానికి ఆదేశాలిస్తూ తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేశారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed