కులగణన సర్వే ఆధారంగా రేషన్‌ కార్డుల జారీ..

by Sumithra |
కులగణన సర్వే ఆధారంగా రేషన్‌ కార్డుల జారీ..
X

దిశ, ఆలూర్ : కొత్త రేషన్‌ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆలూరు మండలంలోని మాచర్ల గ్రామంలో గురువారం సర్వేను పంచాయతీ కార్యదర్శి నాజీర్ నిర్వహిచారు. ఈ సందర్భంగా కార్యదర్శి నాజీర్ మాట్లాడుతూ మాచర్ల గ్రామంలో 118 మంది అర్హులు లిస్ట్ వచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed