‘Hit: The 3rd case’లో టాలీవుడ్ హీరో అతనితోనే ‘హిట్-4’.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Hamsa |
‘Hit: The 3rd case’లో టాలీవుడ్ హీరో అతనితోనే ‘హిట్-4’.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani) దసరా, హాయ్ నాన్న వంటి చిత్రాలతో వరుస హిట్స్ సాధించి ఫుల్ ఫామ్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక గత ఏడాది ఆయన నటించిన ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram) సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్’జే సూర్య కీలక పాత్రల్లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. గత ఏడాది ఆగస్ట్ 24న భారీ అంచనాలన మధ్య విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం నాని ‘హిట్-3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అడివి శేష్ నటించిన ‘హిట్-2’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. యూనిమస్ ప్రొడక్షన్స్‌(Unimus Productions)తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ మేయర్(Mickey Meyer) సంగీతం అందిస్తున్నారు.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మే1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ ‘హిట్-3’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఇందులో టాలీవుడ్ మాస్ హీరో క్లైమాక్స్‌లో కనిపించనున్నట్లు టాక్. ఇక అతనితోనే ‘హిట్-4’ ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది. మాస్ హీరో అంటే రవితేజనే అని అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా వావ్ సూపర్ అని అంటున్నారు.

Next Story

Most Viewed