- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘనంగా కొండా సుస్మిత పటేల్ జన్మదిన వేడుకలు

దిశ, గీసుగొండ : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు దంపతుల ఏకైక పుత్రిక కొండా సుస్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. కొండా సుస్మిత పటేల్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్, రడం భరత్ కుమార్, అల్లం మర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు. 16వ డివిజన్ ధర్మారంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జిల్లా నాయకులు గోపాల నవీన్ రాజ్ కట్ చేశారు. అదే విధంగా సుస్మిత పటేల్ జన్మదినం సందర్భంగా మండలంలోని కోటగండి మైసమ్మ తల్లి దేవాలయంలో ఆలయ అర్చకులు అయ్యప్ప మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు బండి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ పాల్గొని కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు డోలె చిన్ని, దౌడు బాబు, గోనె మల్లారెడ్డి, గాజర్ల గోపి, భిక్షపతి, రవి, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మహిళ నాయకురాలు జన్ను రేణుక, బుర్ర కవిత, మాజీ ఎంపీటీసీలు కాగిత భిక్షపతి, వీరారావు, నాయకులు బొడిగె శోభన్, కొమురయ్య, రాజు, దౌడు సునీల్, కొండా వెంకన్న, కొమ్ముల కిషోర్, కొక్కొండ శ్రీకాంత్, భోగి శ్రీను పేర్ల శ్రవణ్, గాడ్దుల బాలరాజు, కొండా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.