- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరోసారి వర్మను పెట్టిన జనసేన.. ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) చెందుర్తి(Chendurthi)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ(Tdp), జనసేన(Janasena) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చెందుర్తిలో ఆర్‌ఓ ప్లాంట్(RO plant) ప్రారంభోత్సవానికి పిఠాపురం జనసేన ఇంచార్జి మర్రెడ్డి(Pithapuram Janasena in-charge Marreddy) వెళ్లారు. అయితే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ(TDP leader SVSN Varma)ను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మను ఎందుకు ఆహ్వానించలేదని మర్రెడ్డిని ప్రశ్నించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపునకు కృషి చేసిన వర్మను విస్మరిస్తారా అంటూ నిలదీశారు. వైసీపీ సర్పంచ్‌ను ఆహ్వానించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మను ఎందుకు పిలవలేదని మండిపడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలను జనసేన శ్రేణులు.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట సైతం జరిగింది. రిబ్బన్ కటింగ్ తర్వాత కార్యక్రమం మధ్యలోనే మర్రెడ్డి వెళ్లిపోయారు.
అయితే వర్మకు ఆహ్వానం పంపించామని జనసేన శ్రేణులు చెబుతున్నారు. కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వర్మను పిలిచారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. కొన్ని రోజులుగా వర్మను జనసేన పక్కనపెడుతోందని, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు ఆహ్వానం ఉండటంలేదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వర్మను ఆహ్వానించలేదని ఆరోపించారు. వర్మను కావాలనే పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.