అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50,000 చెల్లించాలి : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2025-03-26 14:39:55.0  )
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50,000 చెల్లించాలి : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే
X

దిశ, భూత్పూర్ :దిశ, భూత్పూర్ : అప్పులు చేసి.. నాన్న ఇబ్బందులు పడుతూ.. సాగు చేసిన పంట.. ఒకవైపు.. భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది.. నష్టపోయిన రైతులకు ఎకరవుక్కింటికి రూ .50 వేల నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధ వారం అమిస్తాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ఊరడి పెంటప్ప స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంరూ. రెండు లక్షలు రుణమాఫీ జరిగిందని చెబుతోంది.. మరోవైపు రైతు భరోసా ఇస్తున్నామని పూరించడం తప్ప.. రైతులకు చేసింది ఏమీ లేదు అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే ఎకరాకు రూ 50 వేల రూపాయల నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ గా ఉండే చైర్మన్ అశోక్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బసవరాజు గౌడ్, నాయకులు సత్తూరు నారాయణ గౌడ్, మనె మొనీ సత్యనారాయణ,మురళీధర్ గౌడ్, సాయిలు,శ్రీనివాస్ రెడ్డి, అజ్జు, అశోక్ గౌడ్, బాలస్వామి, డాక్టర్ పాషా, ఆగిరి సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Next Story