- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి’.. మంత్రి నిమ్మల వెల్లడి

దిశ ప్రతినిధి, ఏలూరు/పోలవరం: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజక్టు పనులను 2027 డిసెంబర్‌కు పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రాజెక్టు సందర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 2027 డిసెంబర్‌కు పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, సీడబ్ల్యుసీ, పీపీఎలను సమన్వయ పరుచుకుంటూ డిజైన్లకు అనుమతులు తీసుకుంటున్నామన్నారు.
గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. జగన్ నిర్వాకంతో కొత్తగా 990 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వస్తోందన్నారు. గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా 50 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి 12,157 కోట్ల రూపాయలు నిధులు సాధించారని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్టుకు, నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా వచ్చిందన్నారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్ట్ ను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు, పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని అన్నారు. మంత్రితో పాటు ఇరిగేషన్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.