పేదలకు అండగా సీఎం సహాయనిధి.. మాజీ ఎంపీటీసీ..

by Sumithra |
పేదలకు అండగా సీఎం సహాయనిధి.. మాజీ ఎంపీటీసీ..
X

దిశ, రామన్నపేట : నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని దుబ్బాక మాజీ ఎంపీటీసీ మడూరి జ్యోతి అన్నారు. గ్రామంలోని సామ మనీష్ రెడ్డి ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. చికిత్స నిమిత్తం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో మంజూరైన రూ.60 వేలు చెక్కును లబ్దిదారునికి గురువారం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనాభరెడ్డి, ధనంజయ, గ్యార కిష్ణ, గట్టు బల్ల అంజయ్య, ఇట్టే రాంరెడ్డి, పిల్లి సంజీవ, కోయగూరి అంజయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed