Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-02-13 18:46:09.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.ఈ రోజు ఈరాశి వారు తమ సంతానం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ముఖ్యమైన పనులన్నీ నెరవేరుతాయి. ఈరాశి వారు ఈరోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి : మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు డబ్బును పొదుపుచేయాలని అనుకుంటారు కానీ ఆ కోరిక మాత్రం నెరవేరదు. ఎందుకంటే అతిగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు, మీ స్నేహితులు, బంధువుల సహాయంతో ప్రతి సమస్యను ఎదుర్కొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్ముల్ని బాగా టెన్షన్ కు గురిచేస్తాయి. నేడు మీ ఆర్థిక పరిస్థితి బాగున్నా.. అనవసర, అతి ఖర్చులపైన కాస్త శ్రద్ధ వహించడం మంచిది. మీ హస్య చతురత మీ చుట్టు ఉన్నవారిని మెప్పిస్తుంది. దీంతో మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. సహా ఉద్యోగులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం, మీకు అలసట, ఒత్తిడికి కారణం అవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది .

సింహ రాశి : ఈరోజు మీరు ఇతరులు చెప్పినది వినండి, అదే మీ సమస్యలకు ఒక పరిష్కారం చూపుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. చాలా కాలంగా మిమ్ముల్ని వేధిస్తున్న ఒంటరితనం, పోయి ఆత్మీయులు దొరుకుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రియలెస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కలిసి వస్తుంది.

కన్యా రాశి : దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. మీ ఇంట్లో సామరస్యత కోసం, పనిని పూర్తి సహకారంతో జరగాలి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. సమయమే నిజమైన ధనమని నమ్మితే, మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.

తుల రాశి : మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి.

వృశ్చిక రాశి :ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తాయి.

ధనస్సు రాశి :ఈ రోజు ఈరాశి వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల్లో చిక్కుకోవడం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నేడు డబ్బు కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు రూపొందించుకుని, పనులు ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.

మకర రాశి :ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు,వారియొక్క సలహావలన మీరు మీఆర్థికస్థితి దృఢపరుచుకోగలరు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కుంభ రాశి :ఏదైన తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి.నేడు మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది.

మీన రాశి :రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. వృత్తి నిపుణులు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండవు.

Advertisement

Next Story

Most Viewed