Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-02-08 18:46:25.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : నేడు ఈ రాశి వారు అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందర పాటుతనంతో మాట్లాడవద్దు. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాదిస్తారు.

వృషభ రాశి : నేడు ఈరాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు మీకు ఆందోళనను కలిగిస్తాయి. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి,లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మిథున రాశి : వీలైనంత వరకు మీరు ఈరోజు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. లేకపతే అదే మీకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది.

కర్కాటక రాశి :ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయే అవకాశముంది. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు.

సింహ రాశి : ఈరోజు ఈరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం వస్తుంది. మీ కుటుంబంలో చిన్న పిల్లల ఆరోగ్యం పాడవడం మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. దూరప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్యా రాశి : మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీరు రోజులంతా ఆర్ధికసమస్యలు ఎదురుకున్నప్పటికీ,చివర్లో మీరులాభాలనుచూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు.

తుల రాశి : ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది.

వృశ్చిక రాశి : చాలా రోజులుగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవడం చాలా సంతోషాన్ని ఇస్తాయి. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయే అవకాశముంది. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు.

ధనస్సు రాశి : సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవడం అవసరం. రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సాయిబాబా ఆరాధన మంచిది.

మకర రాశి : ఈరాశి వారికి నేడు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు చేతికి అందొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఆకస్మికంగా బంధువులు ఇంటికి రావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖర్చులు అధికంగా పెరుగుతాయి.

కుంభ రాశి : ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదురు అవుతాయి. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు ఈ రోజు. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు.

మీన రాశి : నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయం లేదా సంపాద నలో మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed