Horoscope Today, November 06,2023: నేటి రాశి ఫలాలు

by Prasanna |   ( Updated:2023-11-05 23:30:12.0  )
Horoscope Today, November 06,2023: నేటి రాశి ఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు మీ స్నేహితుని నుంచి కొంత డబ్బుని అప్పుగా తీసుకుంటారు. మరోవైపు మీ తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల కొంత ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి సలహాతో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే మీరు మంచి విజయం సాధించగలరు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు పెట్టుబడులు వల్ల నష్ట పోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. కాబట్టి ఉన్న డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి. మీ వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఈ కారణంగా మీ కుటుంబ రోజువారీ అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లో పెద్ద వారికి చెప్పి చేయండి.

సింహ రాశి : ఈ రోజు ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామి సహాయంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీ ప్రభుత్వ పనులను పెండింగులో ఉంచకూడదు. లేదంటే భవిష్యత్తులో మీకు సమస్యలొస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు.

కన్యా రాశి: ఈ రాశి వారు వ్యాపారులు నష్టాలను చూస్తారు. కాబట్టి కొన్ని మార్పులు అవసరం. బంధువులతో ఏవైనా వివాదాలుంటే ఈ రోజు ముగిసిపోవచ్చు. పెండింగులో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామి మద్దతుతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.ఏవైనా ఒప్పందాలను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ బంధువులలో కొందరికి డబ్బును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, సమయం మంచిగా ఉంటుంది.

ధనస్సు రాశి : ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న పనులు చేయలేరు. దీంతో కొంత నిరాశగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఈ రోజు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ ఇంట్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణం చేయాల్సి వస్తే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, తండ్రి సహాయంతో పరిష్కారాన్ని కనుగొంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు.

మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంకాలం చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. ఆర్ధిక సమస్యలు తొలగుతాయి. మీ ఇంటికి అతిథులు రావడంతో మీరు చేయాలనుకున్న పనులు చేయలేరు.

Advertisement

Next Story