- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
మేష రాశి : నేడు ఈ రాశి వారు తమ బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎవరైతే నేడు స్థలాన్ని అమ్మాలి అనుకుంటారో వారికి ఈరోజు మంచి ధరకు కొనుగోలు చేసేవారు దొరుకుతారు. ఇది మీకు బాగా కలసి వస్తుంది. పిల్లల చదువులకై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. నేడు మీ జీవితంలోకెళ్ల అత్యంత గొప్పరోజుగా మారుతుంది. నేడు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి : ఈరోజు ఈ రాశిలోని విద్యార్థులకు కలిసి వస్తుంది. చిన్న పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నేడు ఈ రాశిలోని అమ్మాయిలు చాలా సంతోషంగా గడుపుతారు. వీరు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజు ఉద్యోగం దొరకనుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మిథున రాశి : మీరు గతంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్ లకి తల ఒగ్గకండి. వార్షిక ఇంక్రిమెంట్ తో జీతంలో పెరుగుదల, మీకు హుషారును కలిగిస్తుంది. ఇక ఇప్పుడు మీనిరాశను, ఫిర్యాదులను తొలగించివెయ్యండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి.
కర్కాటక రాశి :ఈ రాశివారు నేడు అనుకోని ఖర్చులు చేయడం కుటుంబ సభ్యులకు ఆగ్రహానికి లోను అయ్యేల చేస్తుంది. దుబార ఖర్చులు మానడం చాలా మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరైతే చాలా కాలంగా రుణసదుపాయం కోసం ప్రయత్నం చేస్తారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది.
సింహ రాశి :శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికపరంగా మీకుమిశ్రమంగా ఉంటుంది.మీరు ధనార్జన చేస్తారు.మీమాటలను కఠినంగా వాడతారు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును,దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈరాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు.
కన్యా రాశి :మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి.
తుల రాశి :ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురు, బుధ సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మికంగా మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులు ఈ రాశి వారి ప్రతిభను అంకిత భావాన్ని గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం, ప్రమోషన్ ఇవ్వడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగానే కాకుండా వృత్తి పరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. వృత్తిపరంగా అనూహ్యమైన రీతిలో పురోగతి చెందడం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా మారుతుంది. వృత్తిలో డిమాండ్ పెరుగుతుంది.
వృశ్చిక రాశి :ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. ఈరోజు,మీకుటుంబంలో చిన్నవారితో మీరు మీయొక్క ఖాళీసమయాన్ని వారితో మాట్లాడటము ద్వారా సమయాన్నిగడుపుతారు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.
ధనస్సు రాశి : భారీ వేతనా లతో కూడిన ప్రమోషన్ పొందటానికి ఇది దోహదం చేస్తుంది. ఉద్యోగ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోవడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు అనుభవానికి రావడం జరుగు తుంది. అధికారులతో లేదా యజమానులతో సత్సంబంధాలు ఏర్పడటం కూడా జరిగే అవకాశం ఉంది.
మకర రాశి :ఈరోజు మీరు మీ చరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చిన్న వ్యాపారస్తులకు నేడు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. నేడు మీరు శుభకార్యాలయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కుంభ రాశి :ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదాయం పెరగటం, ప్రమోషన్ రావటం, అధికారుల ఆదరణ లభించడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిలో డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం పెరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది.
మీన రాశి :ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. గతంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ సారి నష్టాలు చవిచూడక తప్పదు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- Tags
- Today