నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

by samatah |   ( Updated:2023-03-09 02:03:07.0  )
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
X

మేష రాశి : ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. అదే విధంగా ఖర్చులు కూడా అధికం అవుతుంటాయి. శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ జీవి భాగస్వామి నుంచి మీరు ఓ తీపి కబురు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈరోజు మీరు ఒంటరిగా గడపడం మంచిది కాదు. కొన్ని విషయాలు మిమ్ముల్ని ఆందోళనకు గురి చేస్తాయి.

వృషభ రాశి : ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యహరించడి. కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.ఈరోజు మీరు మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు. మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకవడానికి కేటాయిస్తారు.

మిథున రాశి : ఈరోజు రాత్రిలోపు మీరు ఆర్థికలాభాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. ఆందోళన పడకండి. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి : మీ ఆర్థిక పరిస్థితి ధృడంగా ఉంటుంది. ఈరోజు మీరు అతి ఖర్చులు లేదా అనవసర ఖర్చుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేశిస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి : గ్రహచలనం రీత్యా, ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు కలిసి వస్తాయి. మీ ప్రియమైన వారు మిమ్ముల్ని అర్థం చేసుకుంటలేరని కొంత బాధకు గురి అవుతారు. ఉమ్మడి వ్యాపారాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. మీరు ఈ సాయంత్రం చాలా ఏంజాయ్ చేస్తుంటారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి : కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలు సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది.

తుల రాశి : ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

వృశ్చిక రాశి : ఈరోజు మీ ఆరోగ్యం సహకరించనందున మీరు పనుల మీద శ్రద్ధకనభరచారు. ఈరోజు రెండో భాగంలోని ఆర్థికక పరిస్థితి మెరుగు పడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్ముల్ని అర్థం చేసుకోవడం వలన మీరు చాలా సంతోషంగా గడుపుతారు.కుటుంబలోని, ఆఫీసులోని సమస్యల వలన కాస్త ఒత్తిడికి గురి అవుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు కానుంది.

ధనస్సు రాశి : కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ ఓ కొల్కి వస్తాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంట్లో శుభకార్యం జరగడం వలన చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తమ కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అది మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తుంది.

మకర రాశి : ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

కుంభ రాశి : మీ కుంటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. డబ్బులు పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు.మీ భాగస్వామి మీ మాటలకు లొంగడం చాలా కష్టం. కుటుంబలోని సమస్యలు కాస్త ఒత్తిడిని పెంచుతాయి.

మీన రాశి : పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలు సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది.


ఇవి కూడా చదవండి :

Telugu Panchangam 09 మార్చి: శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story

Most Viewed