Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (31-08-2024)

by Anjali |   ( Updated:2024-08-30 21:46:03.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (31-08-2024)
X

మేష రాశి: నేడు మేష రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే చాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇవాళ మీరు పెద్దగా కష్టపడకుండానే లాభాల్ని చేకూర్చుకుంటారు. అలాగే మీకు నచ్చిన విధంగా ఉంటారు. సినిమాలు, ప్రొగ్రామ్స్ టీవీలో ఎక్కువగా చూస్తుంటారు. మీ భాగస్వామి మీపై అంతులేని ప్రేమ చూపిస్తారు. నేడు మీరు చాలా ఖాళీగా సమయాన్ని గడుపుతారు. మీకు మంచి జరగాలంటే వెండితో తయారు చేసిన పాత్రలో వాటర్ తాగండి.

వృషభ రాశి: వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికపరంగా అంతా బాగానే ఉంది. సాయంత్రం వేళ సరదాగా బయటకెళ్లి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దూరపు రిలేషన్స్ నుంచి ఊహించని న్యూస్‌లు వింటారు. నేడు సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ఏదో ఒక పనిమీద దృష్టి పెట్టండి. మీ భాగస్వామితో గడపడానికి ప్రయత్నించండి. ఓం భుమాయ నమహా 11 సార్లు రాసి చదవండి అంతా మంచే జరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. సిగరెట్ తాగేవారి పక్కన ఉండొద్దు. ప్రెగ్నెన్సీ మహిళలు గచ్చు మీద నడిచే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇవాళ మీ కంటే పెద్ద వారి ఆశీస్సులు తీసుకోండి. యువతి. యువకులైతే తొలి ప్రేమలో అవకాశం ఉంటుంది. మీ సన్నిహితులతో ఇవాళ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతారు. హెల్తీగా ఉండేందుకు మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి డబ్బును పొదుపు చేసుకోవడానికి ఆలోచించండి. నేడు విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. మీ భాగస్వామి మీతో ఇవాళ ప్రశాంతంగా మాట్లాడుతారు. మీపై స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తారు. మీ లైఫ్ లో నేడు ఊహించని ఛెంజేస్ జరుగుతుంటాయి. మీకు నచ్చిన వ్యక్తులు మీ కోసం భిన్నమైన వంటకాలు చేసి మిమ్మల్ని ఆశ్యర్యపరుస్తారు.

సింహ రాశి: ఈ రాశివారు నేడు అనుకోకుండా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కొంటుంటారు. మీ అక్కా చెల్లెళ్ల, అన్నాదమ్ముల సలహాలు తీసుకుంటారు. కానీ మీ ప్రియమైన వారు మీపై అసహానాన్ని ప్రదర్శిస్తారు. ఇవాళ మీరు అంతగా వర్క్ చేయకపోయినా అలసిపోయినట్లుగా ఉంటారు. మీకు బాగా దగ్గరైన వారిని మీట్ అవుతారు. ఎవరూ ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. ఎదుటివారిపై ప్రేమను కురుపిస్తారు.

కన్యా రాశి: మీ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. ఆధ్మాత్మిక కార్యక్రమాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అవసరాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. నేడు ప్రయాణాలు ఆహ్లాదాన్నికలిగిస్తాయి.

తులా రాశి: కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు బయటికెళ్లినట్లైతే మనీని జాగ్రత్తగా తీసుకెళ్లండి. డబ్బు దొంగిలించబడే అవకాశం ఉంటుంది. నేడు కొన్ని విషయాలు మిమ్మిల్ని బాధ పెడుతాయి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధిత విషయాలపై ప్రభావం చూపిస్తాయి. వెండి ఉంగరం చేతికి పెట్టుకోవడం మేలు.

వృశ్చిక రాశి: నేడు ఈ రాశి వారు ఇతరులతో ప్రశంసలు పొందుతారు. నేటి నుంచి డబ్బును పొదుపు చేసుకోవడం మంచిది. మీ భాగస్వామి మీ ఆలోచనలకు రెస్పెక్ట్ ఇస్తారు. భార్యలకు ఇంటిపనుల్లో భర్తలు సహాయపడతారు. ఎక్కువ సమయం భార్యలతో గడపడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఇవాళ ఏదైనా ప్లాన్ చేసే ముందు మీ భాగస్వామితో చర్చించండి. కుటుంబ కలహాల వల్ల ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.

ధనుస్సు రాశి: ప్రశాంతంగా ఉండాలంటే నేడు ఏదో ఒక పనిలో లీవమవ్వండి. ఏదో ఒక వస్తువు దానం చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో పడకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల నేడు ఆందోళన చెందుతారు. రాత్రి వేళలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం మంచిది కాదు. దేన్నైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి. ఖాళీగా ఉంటే మీ మనస్సు ప్రతికూల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాగా పుస్తకాలు చదవండి.

మకర రాశి: నేడు మీరు ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. కాగా రక్షణ కోసం శ్రద్ధ పెట్టండి. ఆర్థికంగా నష్టం నష్టపోతారు. ఇతరులతో వాదించడం మానేయండి. అనవసరపు విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. మీకు ఇష్టమైన పాటలను నేడు చెవుల నిండా వింటారు. బయటకెళ్లి ఆహ్లాదరకరంగా గడపండి. ఇవాళ అనూహ్య మార్పులు జరుగుతాయి. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి.

కుంభ రాశి: డబ్బు సంపాదించుకోవడానికి నేడు మంచి రోజు. కొత్త బిజినెస్ లు ప్రారంభించండి. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చెయ్యండి. ఖాళీ టైంలో సమస్యలకు తగిన పరిష్కారము ఆలోచించండి. ఇష్టమైన వ్యక్తుల్ని కౌగిలించుకుంటారు. ఇవాళ మీరు ఇది వరకు చేసిన తప్పులను తెలుసుకుని బాధపడుతుంటారు.

మీన రాశి: ఈ రాశి వారు ఇవాళ భూమి రియల్ ఎస్టేట్, సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన దృష్టి సారించడం మంచిది. దీంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ భార్త మీపై, మీ పిల్లలపై ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. మీ భాగస్వామి పనులన్నీ పక్కన పెట్టి మీ కోసం సమయాన్ని కేటాయిస్తాడు. మీ భవిష్యత్తు గురించి విచారం చెందకండి. కూర్చుని ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. అనుకోకుండా మిమ్మల్ని కలవడానికి మీ స్నేహితులు మీ దగ్గరకు వస్తారు.

Advertisement

Next Story

Most Viewed