Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (04-09-2024)

by Anjali |   ( Updated:2024-09-03 21:45:47.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (04-09-2024)
X

మేష రాశి: నేడు మేష రాశి వారు ఇతరులతో మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడండి. మీ మాటలు పక్కవారిని ఇబ్బంది పెడతాయి. ఫ్రెండ్స్ తో పార్టీలు అని డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఆర్థికంగా నేడు లాభం చేకూరుతుంది. బయట ఫంక్షన్స్ వెళ్లాటానికి ఎక్కువ ఆసక్తి కనబరుచుతారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. నేడు ముఖం నిండా చిరునవ్వుతో వెలిగిపోతుంటారు. వైవాహిత జీవితంలో కూడా అద్భుతంగా సాగిపోతుంది. ఇతరులు మీపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరుస్తారు.

వృషభ రాశి: ఇవాళ మీరు చాలా ఎనర్టీగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి బాధ ఉండదు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆయుధాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఒత్తిడికి లోనవ్వకూడదు. వయసు వచ్చిన ఆడపిల్లలు బాగా అల్లరి చేస్తారు. కానీ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడం మంచిది. నేడు మీ సమయం మీకు తెలియకుండానే వృథా అయిపోతుంటుంది. మీ భర్త కారణంగా కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. ఆర్థికపరంగా నష్టం జరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఏ పని స్టార్ట్ చేసినా చాలా తొందరగా ఫినిష్ చేసేస్తారు. ఫైనాన్షియల్‌గా అంతా బాగానే ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటారు. నేడు ప్రశాంతమైన ప్లేస్ కు వెళ్లి గడపండి. స్నేహితులకు మీట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో బాధాకరమైన క్షణాలు ఏమైనా ఉంటే ఇవాళ వాటికి చెక్ పెడతారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించినా, మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకపోవడం మంచిది.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కానీ నేడు మానసిక ఆనందాన్ని పొందుతారు. మీ సన్నిహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. వారి సలహాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నేడు మీ లోపాలేంటో తెలుసుకుంటారు. సాయంత్రం మీ ఇంటి వద్ద రిలాక్స్ అవడానికి చుట్టాలు ప్రవాహంలాగా వస్తుంటారు. కానీ పలు అనవసరమైన పనుల వల్ల సమయాన్ని వృథా చేస్తారు.

సింహ రాశి: ఇవాళ మీరు ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతుంటారు. కానీ అతిసంతోషం పలు సమస్యలకు దారీ తీస్తుంది. కాగా మీ ఎక్జైట్ మెంట్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటే మంచిది. చదువు పట్ల శ్రద్ధ వహించరు. ఫైనాన్షియల్ గా బాగా ఉంటుంది. ఇవాళ మీ భాగస్వామితో ప్రతి విషయంలో డిమాండ్ చేస్తూ మాట్లాడుతుంటారు.

కన్యా రాశి: ఆర్థికంగా చాలా బాగుంది. తరచూ ఖర్చు చేస్తోన్న కూడా వెంటవెంటనే అంతకు ధనాన్ని పొదుపు చేసే సామర్థం కలిగి ఉంటారు. బంధువుల కారణంగా ఇవాళ ఉల్లాసంగా ఉంటారు. మీ ఇంటికి ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎక్కువగా వస్తుంటారు. మీరు ఇతరులతో ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు.

తులా రాశి: ఈ రాశి వారు యోగా, ధ్యానం చేయడం మంచిది. దీంతో రోజంగా యాక్టివ్‌గా ఉంటారు. నేడు విలువైన కానుకలు సన్నిహితుల దగ్గర నుంచి అందుకుంటారు. నేడు చాలా సంతోషంగా గడిచిపోతుంది. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి: నేడు ఇతరులు మిమ్మిల్ని ఎక్కువగా విసుగిస్తూ ఉంటారు. కానీ మీరు ఓపికగా ఉంటారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా ముఖ్యం. మీ భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచుకోండి. లేకపోతే పలు సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఏ పనైనా ఇవాళ ప్రారంభించడం వల్ల మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి: శారీరకంగా బాగా అలసిపోతారు. ఏ పనైనా ఒత్తిడి తీసుకుని మరీ చేస్తుంటారు. విశ్రాంతి అనేది తప్పనిసరి. నేడు ఇతరులకు డబ్బు దానం చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపుతారు. మీ అక్కాచెల్లెల్లు గానీ , అన్నాదమ్ములతో గానీ ఇంట్లో కూర్చుని మ్యాచ్, సినిమా గానీ వీక్షిస్తారు. ఫైనాన్షియల్‌గా అంతా బాగానే ఉంటుంది.

మకర రాశి: ఇవాళ ఎవరైనా సరే మీపై నమ్మకంతో ప్రతి ఒక్క విషయాన్ని మీతో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. నేడు డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే మీ భాగస్వామితో మునపటి విషయాలు పంచుకోండి. ఇతరులు మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయాలని చూస్తారు. కాగా జాగ్రత్తగా ఉండడం మేలు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం మానుకోండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

కుంభ రాశి: నేడు ప్రతి చిన్న విషయానికి ఇతరులపై విరుచుకుపడతారు. కాగా మీ మూడ్ ను సెట్ చేసుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజవ్వడం మేలు. తోబుట్టువుల నుంచి సహాయాన్ని పొందుతారు. బ్లాక్ మెయిల్ లాంటివి చేయడం మానుకోవడం మంచిది. ఎక్కడికెళ్లినా సరే విజయం మీ సొంతం అవుతుంది. మీ సంతోషాన్ని మీ రిలేషన్స్ పాడు చేసే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి: ఇవాళ అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పని మొదలు పెట్టినా పూర్తి అయ్యేవరకు వదిలిపెట్టరు. కానీ పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీ భాగస్వామిని అర్థం చేసుకుని.. తమ బాధలను వినడానికి సమయాన్ని కేటాయిస్తారు. మీ సన్నిహితుల్ని కలవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. మీ భార్యను గౌరవించడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed