మహా విష్ణువుకు ఇష్టమైన రాశులు ఇవే.. వారికి అదృష్టమే అదృష్టం

by Prasanna |   ( Updated:2024-07-09 09:24:07.0  )
మహా విష్ణువుకు ఇష్టమైన రాశులు ఇవే.. వారికి అదృష్టమే అదృష్టం
X

దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయం ప్రకారం, ఒక్కో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ప్రతి ఏడాది జూన్‌లో వచ్చే నిర్జల ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జైష్ట మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజున హిందువులందరూ విష్ణువును పూజించడం సర్వసాధారణం. అయితే, విష్ణుమూర్తికి ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయి. వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం.

కర్కాటక రాశి

విష్ణుమూర్తికి కర్కాటక రాశి అంటే చాలా ఆసక్తి. ఈ రాశి యొక్క వ్యక్తులు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీర్వాదాలను పొందడమే కాకుండా, ప్రతిదానిలో విజయం సాధించడానికి చాలా శక్తిని కలిగి ఉంటారు. ఇది ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీ వివాహంలో సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీరు క్రమం తప్పకుండా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.

సింహ రాశి

విష్ణువుకి కూడా సింహరాశి అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు కూడా చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇంకా, ఆయన అనుగ్రహంతో మీరు సాధించలేని ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాకుండా మీరు కృషికి తగిన ఫలితాలను పొందుతారు. దీంతో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు మహా విష్ణువును తలచుకోండి.. ఇలా చేయడం వలన లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story