- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2023 పంచాంగం : సింహరాశి వారికి అనుకోని అదృష్టం కలిగే అవకాశం
సింహ రాశి
సార గోచారము: సింహ మాసములో పుట్టిన వారికి
చాంద్ర గోచారము : మఘ, పూర్వఫల్గుని; ఉత్తరఫల్గుని 1
నామనక్షత్రము: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే
ఆదాయ వ్యయాలు
ఆదాయం 14
వ్యయం 2
రాజపూజ్యం 1
అవమానం 7
గురువు : ఏప్రిల్ 22 వరకు 8న సువర్ణమూర్తి. శుభాశుభ మిశ్రమముగా ఉండును. ఆరోగ్యవృద్ధి కలుగును. శ్రమ మీద కార్యసిద్ధి యగును. తదాది వత్సర పర్యస్తం 9న రజతమూర్తి. అన్ని రంగాలలోను విషమ సమస్యలు తీరును.
శని : వత్సరపర్యస్తం 7న లోహమూర్తి, కుటుంబమున సౌఖ్యము తగ్గును.
రాహువు : అక్టోబరు 30 వరకు 9న సువర్ణమూర్తి అన్ని ప్రయత్నములందు విజయము చేకూరగలదు. తదాది వత్సరపర్యస్తం 8న తామ్రమూర్తి. అనారోగ్యములు,ఆందోళన ఎక్కువగా ఉండును
కేతువు : అక్టోబరు 30 వరకు 3న సువర్ణమూర్తి. అన్ని ప్రయత్నములందు విజయం చేకూరగలదు.తదాది వత్సరపర్యస్తం2న తామ్రమూర్తి. మాట విలువ తగ్గును, ఆర్థిక పురోగతి తగ్గును.
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కారీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు నష్టపోతారు. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, పెళ్లి సంబ౦ధం కుదర్చుకోవడం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవము కలుగును. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్ళు ఆలస్యమగు సూచనలు కలవు. పాత బకాయిలు వసూళ్ళు అవుతాయి. అధికారులను, ప్రముఖలను సంప్రదిస్తారు. కోర్టు వ్యాపారములు, వ్యవహారములు ఓ కొల్కి వస్తాయి.వివాహాది శుభకార్యములు ఇతిప్రయాసతో నెరవేరును. కళాకారులకు, ఆధ్యాత్మిక రంగాలలోని వారికి అభివృద్ధి కలుగును. నిరుద్యోగులకు ఉపాధి కలుగును. ధనాభివృద్ధి సిద్ధించును. సంతానమునకు స్వల్పముగా ఆరోగ్య భంగములు, కళత్ర విరోధము ఏర్పడును. విద్యార్థులు శ్రమ పడినచో కొన్నింటిలోనైనా విజయమును సాధించగలరు.
మాసాంతములో ప్రయత్న పూర్వక పనులలో కొన్నింట విజయమును సాధించగలరు.ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించాలి. విద్యార్థులు అనవసరపు ఆందోళనకు గురవుతారు. కళాకారులకు, విద్వాంసులకు గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. మాసాంతంలో స్పెక్యులేషన్ చేసేవారు ఆందోళనకు గురవుతారు. వ్యవసాయం, తోటలు ఉన్నవారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయాలలో మాట పట్టింపులకు పోరాదు. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నానికి పట్టుదలను జోడించాల్సిన అవసరం వస్తుంది. అవకాశాల్ని జారవిడవకుండా వ్యవహరించండి. బ౦ధుమిత్రులతో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో విహారానికి వెడతారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టరు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగాఉంది. భార్య వైవు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ మే నెల మొదటి వారం నుంచి ఈ ఏడాది చివరి వరకు కొనసాగటం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి