- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope: ఈ రోజు ఏ రాశి వారికి కలిసి రానుందంటే?
మేష రాశి: ఈ రాశి వారు తండ్రి సలహాలు పాటించడం వల్ల ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పలు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు అద్భుతమైన మేధాశక్తి సహాయపడుతుంది. అలాగే ఈ రాశి వారి ఆఫీసులో మీరు చేసిన పనికి సీనియర్ మెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుండాలంటే భాగస్వామి తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే సంతోషమైన క్షణాలు ఎదురవుతాయి.
వృషభ రాశి: సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి కానీ ఉమ్మడి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చెయ్యండి. మీ ప్రోత్సాహం అతనికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి. మీతో కలిసి పనిచేసే కోలిగ్స్‌పై కోప్పడతారు.
మిథున రాశి: ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇతరుల నిర్లక్ష్యం వల్ల మీకు సమస్యను కలిగించవచ్చు. మీరు ఈరోజు ధనలాభాన్ని పొందుతారు. అలాగే మీకు కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం చేస్తారు. మీరు కొద్దిగా సమయాన్ని, శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే, అద్భుతమైన లాభాలు పొందుతారు. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు తెలుస్తాయి అవి చూసి ఆశ్చర్యానికి లోనవుతారు.
కర్కాటక రాశి: భావోద్వేగాలను అదుపు చేసుకుని భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలెయ్యాలి. ఎందుకంటే, మీ ఆరోగ్యం సత్వరమే, పాడయే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే పిల్లలు వారి చదువులపై, భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది . ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
సింహ రాశి : మీ స్నేహితుడు మిమ్ములను పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. జాలి పడి మీరు సహాయం చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అనుకున్నంత ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకుండా మళ్లీ ట్రై చేయాలి. ఇతరులతో రహస్యాలను పంచుకోవటం వలన నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కన్య రాశి: ఈ రాశి వారు తోబుట్టువుల సహాయ సహకారాలతో ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కాబట్టి పెద్దవారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను చెడగొడుతుంది. ఈ రోజు మీకోసం సమయాన్ని కేటాయించుకోవడంతో పాటుగా కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
తులా రాశి: రోజంతా ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, చివర్లో సమస్య పరిష్కారం అయి లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా మాట్లాడేందుకు ఎదురుచూస్తూ మాట్లాడలేకపోయినా వారితో ఈ రోజే మాట్లాడుతారు!. అలాగే మీ వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. చాలా గొప్ప విషయాన్ని విని సంతోషకరమైన అనుభూతి పొందుతారు.
వృశ్చిక రాశి: ఎప్పటినుంచో మీరు చేస్తున్న పొదుపు డబ్బులు మీకు ఈ రోజు మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి కానీ ఖర్చులు బాధిస్తాయి. అలాగే అనుకోని శుభవార్త వింటారు. కుటుంబం అంతటికి సంతోష భరిత క్షణాలను పంచుకుంటారు. ప్రేమికులకు అయితే మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం చేస్తుంది.
ధనుస్సు రాశి : ఎవరు ఏది చెప్పినా వినకుండా ఉండకూడదు. ఎందుకంటే కొందరు చెప్పే మాటలు వినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని విధంగా లాభాలు కలుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో విశ్రాంతి తీసుకోలేరు. కాబట్టి కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోవాలి. కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఇది మీ జీవితంలో కెల్ల అత్యంత అద్భుతమైన రోజు కానుంది. సాధ్యమైనంతవరకు వ్యాపారస్తులు వారి వ్యాపార ఆలోచనలు ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మకర రాశి: ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానేయండి లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది మీ జీవితంలో కెల్ల అత్యంత అద్భుతమైన రోజు కానుంది. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వ్యాపారాలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అనేక విషయాల్లో ఇష్టంగా నిర్ణయం తీసుకోక పోవడం వివాదాలు తలెత్తుతాయి.
కుంభ రాశి: ఇంటి పనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు. వచ్చే కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు చేకూరుతాయి. మీ పనిలో నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్స్‌ను పాటించాలి. ఈ రోజు ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు.
మీన రాశి : ఈరోజు అవసరమైన వాటినే కొని ఖర్చులు తగ్గించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సహంగా పనిచేస్తారు. మీకు ఇచ్చిన సమయం కంటే ముందే మీరు మీ పనులను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశికి ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్‌లు చూడటంతోనే సమయాన్ని వృధా చేస్తారు.