భద్ర మహాపురుష రాజయోగం.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?

by Prasanna |
భద్ర మహాపురుష రాజయోగం.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?
X

దిశ, ఫీచర్స్: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు ఈ మాసంలో వృషభం నుండి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల 55 నిమిషాలకు బుధుడు, మిధున రాశిలోకి వెళతాడు.మిథునరాశిలో బుధుడు సంచరించడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగ ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

భద్ర మహాపురుష రాజయోగం వలన కన్యారాశి వారికి శుభంగా ఉండనుంది. ఆగిపోయిన పనులన్ని పూర్తి అవుతాయి. ఈ సమయంలో మీ వృత్తి, వ్యాపారంలో కూడా పురోగతిని చూస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వారు, ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో ఎదుగుదల కోసం చూస్తున్న ఎవరైనా ఈ సమయంలో శుభవార్త వింటారు.

ధనుస్సు రాశి

భద్ర మహాపురుష రాజయోగం కారణంగా.. ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు ఉపశమనం పొందుతారు. అద్భుతమైన వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించండి. ధనుస్సు రాశి వ్యాపార, వ్యాపారాలలో గొప్ప ఆర్థిక పురోగతిని సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story