2023 పంచాంగం : మేషరాశి వారికి ఈ సారి అద్భుతమైన ఫలితాలు

by samatah |   ( Updated:2023-03-22 15:55:30.0  )
2023 పంచాంగం  : మేషరాశి వారికి ఈ సారి అద్భుతమైన ఫలితాలు
X

శోభకృత నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో తెలుగు ప్రజలు, కొత్త ఏడాది తమ పంచాంగం చూసుకుంటారు. ఈ ఏడాది మొత్తం వారికి ఆర్థికంగా, వ్యాపారం, విద్యా, ఉద్యోగం తదితర అంశాల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో, 12 రాశుల వారికి 2023-2024 కాలం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

సౌర గోచారము : మేష మాసములో పుట్టినవారికి

చాంద్ర గోచారము : అశ్విని, భరణి, కృత్తిక 1

నామ నక్షత్రము: చూ, చె, చో, లా, లీ, లూ, లే, లో, ల

ఆదాయ వ్యయాలు

ఆదాయం 5,

వ్యయం 5,

రాజపూజ్యం 3,

అవమానం 1

గురువు : ఏప్రిల్ 22 వరకు 12న రజతమూర్తి. అంతటా శ్రమతో కూడిన * ఆసక్తి విజయము సిద్ధించును. తదాది వత్సరపర్యన్తం 1న సువర్ణమూర్తి. వివాహాది మంగళకార్యములు అతికష్టమున నెరవేరును.

శని : వత్సరపర్యన్తం 11న లోహమూర్తి. అంతటా చికాకులు పెరుగును.

రాహువు: అక్టోబరు 30 వరకు 1న రజతమూర్తి ప్రయత్నములు ఎక్కువ, తక్కువ కేతువులు ఫలితములు ఉండును. తదాది వత్సరపర్యన్తం 12న రజతమూర్తి. అంతటా శ్రమతో కూడిన విజయము సిద్ధించును.

కేతువు : అక్టోబరు 30 వరకు 7న రజతమూర్తి. శ్రమకు తగిన ఫలితములు కలుగును. తదాది వత్సరపర్యన్తం 6న రజతమూర్తి. కొంత అనుకూలత వస్తాయి. కలుగును. అన్ని రంగాల వారికి నిదానముగా విజయములు సిద్ధించును.

ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శని 11వ స్థానంలోనూ, గురువు రాశిలోనూ, రాహువు వ్యయం లోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకులు తగ్గుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ అంశాలన్నీ గరిష్ట స్థాయిలో పనిచేస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు, చేర్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో చాలావరకు పెరుగుదల కనిపిస్తుంది. రుణ బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.గత ఏడాది నాటి కొన్ని ప్రతికూలతలు సానుకూలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం సంతరించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతభత్యాల పెరుగుదల, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ, విదేశాలలో స్థిర నివాసం వంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిప్రయత్నానికి పట్టుదల చూపించాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు.ఈ రాశి వారు సంవత్సరం చివరన స్థిర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఈ రాశి వారు ఈ సంవత్సరం మీరు చేసే మంచి పని మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రజాధారణ పొందుతారు. రాజకీయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రతి పనిలో తోబొట్టువుల మద్దతు ఉంటుంది. కానీ మిమ్ముల్ని ఈ సంవత్సరం మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉంది. అవి కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారానికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఈ సంవత్సరం మీకు అదృష్టం వలన ఆగిపోయి, నిలిచి పోయిన పనులన్నీ మళ్లీ వేగాన్ని పుంజుకొని, పూర్తి అవుతాయి. కుటుంబంలో ఆస్థి వివాదాలు జరిగే అవకాశం ఉంది కాస్త శ్రద్ధ వహించడం మంచిది. కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారం కొత్త రంగాలలో విస్తరించవొచ్చు మరియు మిమల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది.ఈ సమయంలో నా కెరీర్ లో ప్రమోషన్ అవకశాలు బలంగా ఉన్నాయి.డిసెంబర్లో మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి.రాహువు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీరు డబ్బు డిమాండ్ చేసే అవాంచిత ప్రయాణాలకు వెళ్ళవలిసి ఉంటుంది.కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి కానీ మీ వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.అయితే మేషరాశి విద్యార్థులకు ఇది సవాలుగా ఉంటుంది. 2023 ప్రకారం సంవత్సర చివరి నాటికి మీరు మీ కెరీర్ లో చాలా విజయాలు సాదిస్తారని మరియు కొంతమంది కొత్త వ్యక్తులను కలవడం ద్వారా మీరు మీ వ్యాపారంలో పురోగతి సాదించే అవకాశాన్ని పొందుతారు.మీరు ఈ సంవత్సర జీవితం నుండి చాలా పొందవొచ్చు కానీ దీని కోసం మీరు మీ అసహన వైఖరిని విడిచి పెట్టాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రమాదకరమని నిరూపించవొచ్చు.మీ జీవిత భాగస్వామి యొక్క మద్దత్తు మిమల్ని జీవితంలో ముందుకు తీసుకువెళుతుంది.

ఇవి కూడా చదవండి :

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed