- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆషాడమాసంలో అదృష్టం మొత్తం ఆ రాశుల వారిదే.. మీ రాశి ఉందా..?
దిశ, ఫీచర్స్ : ఆషాడ మాసం హిందూ మాసంలోని నాల్గవ నెలలో ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఆషాడ మాసం ప్రత్యేకమైనది. ఈ మాసంలో శ్రీ మహా విష్ణువు ఏకాదశి నాడు సుమారు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో కన్యారాశి, మకర రాశుల వారికీ శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కన్యారాశి
ఆషామాసంలో కూడా కన్యా రాశికి శుభ ప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా, ఈ సమయంలో మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భూమి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో కొత్త కారు కొనాలని కోరుకుంటే, మీ కోరిక నెరవేరుతుంది. మీరు పని చేసే ఆఫీసులో మీ జీతం పెరుగుతుంది. విష్ణువు అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి
మకరరాశి వారికి ఆషాడమాసంలో రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రేమ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి గురించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే.. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. మీ ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు, మీ కుటుంబంతో కలిసి మతపరమైన తీర్థయాత్రకు వెళ్తారు. ఇక పని చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.