పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

by Shyam |
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
X

దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం పట్ణణంలోని 45వ డివిజన్‌ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతు.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంటే ఏ మాత్రం భయపడకుండా పనిచేస్తున్నది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులేనని నరాల సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, కొయ్యడా శంకర్, దామ వేణుగోపాల్, ఠాకూర్ గిరీష్ సింగ్, క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు.

Tags: sanitation workers, nizamabad, ts news, daily needs distribution

Advertisement

Next Story