- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే
దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతుంటారు. దాహం, అలసట, తలనొప్పి మరియు మైకం రావడాన్ని హ్యాంగోవర్ అంటారు. అయితే మనం హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంది. హ్యాంగోవర్ లో ఉన్నవారు మెడిసిన్ ద్వారా నయం చేసుకోవచ్చు. అలా కాకుండా వంటింటి చిట్కాలతో యాంగోవర్ నుంచి ఈజీగా బయటపడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టిఫిన్ తప్పని సరిగా చేయాలి
మద్యం మత్తులో ఏదైనా తింటే వాంటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే తినే సహాసం చేయరు. అలా కాకుండా మనకు నచ్చిన టిఫిన్ చేయాలి. ఎందుకంటే మద్యం సేవించినప్పుడు మన శరీరంలో లాక్టిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించి హ్యాంగోవర్ కు కారణం అవుతుంది. ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ను సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. అదే సమయంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు వంటి పోషకమైన ఆహారాన్ని శరీరానికి అందింస్తే ఇంకా మంచింది.
వాటర్ తాగాలి
మద్యం సేవించడం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ అవుతుంది. దీంతో విపరీతంగా యూరిన్ కు వెళ్లాల్సి ఉంటుంది. యూరిన్ కు ఎక్కువ సార్లు వెళ్లడం వల్ల మన శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఈ క్రమంలో శరీరంలో మిగిలిపోయిన వ్యర్ధాలన్నీ మిగిలిపోతాయి. వాటిని బయటకు పంపాలంటే ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అలా నీరు తాగడం వల్ల మన శరీరానికి తగినంత నీరందుతుంది. యాంగోవర్ నుంచి ఈజీగా బయటపడవచ్చు.
యాంటీ ఆక్సిండెట్లు
ఆల్కాహాల్ తాగడం వల్ల ఒత్తిడి ఎక్కువైతుంది. దీంతో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఉన్న కణాల్ని దెబ్బతీసి గుండెజబ్బులు, క్యాన్సర్లతో పాటు హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న బెర్రీలు,చెర్రీస్, ద్రాక్ష, దానిమ్మ, క్యారెట్లు, బచ్చలికూర, అల్లం, డార్క్ చాక్లెట్లను తినడం వల్ల హ్యాంగోవర్ తో పాటు పైన తెలిపిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
కాఫీ, టీలు తాగాలి
ఇది కొంచె విచిత్రంగా ఉన్న కాఫీ, టీ తాగడం వల్ల హ్యాంగర్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాఫీ, బ్లాక్ టీ మరియు గ్రీన్ టీలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డ్రింక్ చేయడం వల్ల కలిగే అనార్ధాల నుంచి బయటపడేస్తాయి. ఇవి మద్యపానం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి.