ఆ దేశంలోని మసీదుల్లాగా సెక్రటేరియట్‌లో మసీదులు నిర్మిస్తాం.. హోంమంత్రి మహమూద్‌ అలీ

by Shyam |
ali
X

దిశ, తెలంగాణ బ్యూరో: అద్భుతమైన శైలిలో.. టర్కీ మసీదుల నమూనాల ప్రకారం సెక్రటేరియట్‌లో మసీదులు నిర్మిస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి గురువారం హైదరాబాద్‌లోని నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత సచివాలయంలో మసీదులు 700 గజాల విస్తీర్ణంలో ఉండేవని, అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రెండు మసీదులకు కేసీఆర్ 1500 గజాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు.

పెద్ద మసీదులో ఇమామ్‌కు ఇల్లు కూడా నిర్మిస్తున్నామని, ఆయన అక్కడే ఉండి సమయానికి ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో షేక్ జామియా, ముఫ్తీ గియాస్‌, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ సలీం, మాజీ ఎమ్మెల్సీ ముహమ్మద్ ఫరీదుద్దీన్, మాజీ అధ్యక్షుడు రహీముద్దీన్ అన్సారీ, ఖమరుద్దీన్, మసీహుల్లాఖాన్, అక్బర్ హుస్సేన్, మహ్మద్ యూసుఫ్ జాహిద్, సయ్యద్ అబ్దుల్ అలీమ్, ఇనాయత్ అలీ బాఖరీ, హైదర్ అఘా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story